ఛలో అసెంబ్లీని అడ్డుకున్న పోలీసులు…

0
130

జిల్లా వ్యాప్తంగా భా.జ.పా నాయకుల ముందస్తు అరెస్ట్…

జగిత్యాల తాజా కబురు:భా.జ.పా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ పిలుపు మేరకు సెప్టెంబర్ 17వ తేదీ ని తెలంగాణ విమోచన దినోత్సవంగా ప్రకటించాలని తలపెట్టిన ఛలో అసెంబ్లీ కార్యక్రమానికి జిల్లా నుండి బయలుదేరిన భా.జ.పా నాయకులను, కార్యకర్తలను పోలీసులు గురువారం రాత్రి నుండే గృహ నిర్బంధం,అరెస్టులు చేసారు.బుగ్గారం మండలం నుండి భా.జ.పా శ్రేణులు అధిక సంఖ్యలో వెళుతున్నారని సమాచారం మేరకు ఎస్సై మంద చిరంజీవి, ఎఎస్సై రమణారెడ్డి లు తమ సిబ్బంది తో కలిసి గురువారం రాత్రి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మంచె రాజేష్,బుగ్గారం మండల శాఖ అధ్యక్షుడు మంచాల పరుశురాం, ఉపాధ్యక్షులు సుంకం ప్రశాంత్ తో పాటుగా 14 మందిని అరెస్ట్ చేశారు. రాయికల్ మండలం నుండి శుక్రవారం ఉదయం ఛలో అసెంబ్లీ కార్యక్రమానికి బయలుదేరిన భా.జ.పా జిల్లా ఉపాధ్యక్షులు బోడుగం మోహన్ రెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి కుర్మ మల్లారెడ్డి, ఎం.పీ.టీ.సీ సభ్యులు రాజనాల మధుకుమార్, ఆకుల మహేష్ లతో పాటుగా పలువురు మండల నాయకులను,మెట్పల్లి పట్టణ భా.జ.పా అధ్యక్షులు గంప శ్రీనివాస్,సుంకెట విజయ్ ఆధ్వర్యంలో బయలుదేరిన కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. సారంగాపూర్ మండలంలో జిల్లా అభివృద్ధి దిశ సమన్వయ కమిటీ సభ్యులు, భా.జ.పా నాయకులు ఎండబెట్ల వరుణ్ కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం ఛలో అసెంబ్లీ కార్యక్రమానికి బయలుదేరిన మండల అధ్యక్షులు బద్దెల గంగరాజం, సీనియర్ నాయకులు కాలగిరి మధు లతో పాటుగా పలువురి కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here