చేయూత స్వచ్చంధ సేవా సంస్థ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువుల పంపిణి

0
181

కోరుట్ల తాజా కబురు: చేయూత స్వచ్చంధ సేవా సంస్థ ఆధ్వర్యంలో దాతల సహకారంతో కొనసాగుతున్న నిత్యావసర వస్తువుల పంపిణి కార్యక్రమం బుధవారం స్థానిక సాయి రామ నదీ తీరంలో నివసిస్తున్న వలస కుటుంబాలకు బియ్యం, కూరగాయలు, మాస్కులు, సబ్బుల ను పంపిణి చేశారు.

కొనసాగుతున్న లాక్ డౌన్ తో ఉపాధి లేక వలస కుటుంబాలు అర్ధాకలితో అలమటిస్తూనే ఉన్నారు.కోరుట్ల పట్టణంలో యువజన,స్వచ్చంధ,ఆధ్యాత్మిక రంగాలతో పాటు పలువురు స్వచ్చంధ దాతలు ఎవరికి ఎలా వీలైతే అలా వలస కుటుంబీకులకు, నిరాశ్రయులకు అన్నం, బియ్యం, కూరగాయలు, నిత్యావసరాలు పంపిణి చేస్తూనే ఉన్నారు. పట్టణం లో అన్నార్తుల ఆకలి తీర్చేందుకు చాలా సంస్థలు , వ్యక్తిగతంగానూ యువజన సంఘాల ఆధ్వర్యంలో ప్రతీ రోజు అన్నం, కూరలతో కూడిన ప్యాకెట్లు వేలాదిగా పంపిణి అవుతున్నాయంటే ఇది కోరుట్ల పట్టణ సామాజిక కార్యకర్తల కృషి అని చెప్పక తప్పదు..

లాక్ డౌన్ నేపథ్యంలో వలస కార్మికులకు బాసటగా నిలువాలనే లక్ష్యంతో సహృదయ దాతల సహకారంతో చేయూత స్వచ్చంధ సేవా సంస్థ ఆధ్వర్యంలో లాక్ డౌన్ ప్రారంభమైనప్పటి నుండి నేటి వరకు ప్రతీరోజు వారి ఆకలి తీర్చేందుకు ప్రయత్నం చేస్తూనే వుంది. దాతలు కూడా స్పందిస్తూ చేయూత సంస్థ కు చేయూతను అందిస్తూనే ఉన్నారు..

ఈ క్రమంలో బుధవారం రోజున కోరుట్ల పట్టణానికి చెందిన స్వర్గీయ గడ్డం వెంకట్ రెడ్డి – శ్రీమతి సత్తెమ్మ గార్ల కుమారుడు – కోడలు శ్రీ గడ్డం శ్రీనివాస్ రెడ్డి , శ్రీమతి ప్రమీల దంపతులు అన్నార్తుల ఆకలి తీర్చేందుకు గాను 25 కిలోల బియ్యం తో పాటు , 20 కుటుంబాలకు రెండు రోజులకు సరిపడా కూరగాయలు, కోరుట్ల పట్టణానికి చెందిన శ్రీ అయిండ్ల సంజీవ రెడ్డి గారు పంపిణి నిమిత్తం 35 కిలోల బియ్యం విరాళంగా అందించారు. వారి సహకారంతో స్థానిక సాయిరామ నదీ తీరం లో నివసిస్తున్న 16 కుటుంబాలకు బియ్యం, కూరగాయలు, మాస్కులు, వ్యక్తిగత పరిశుభ్రతకు అవసరమయ్యే సబ్బులు, సర్ఫులు, షాంపులు ఈరోజు చేయూత స్వచ్చంధ సేవా సంస్థ ఆధ్వర్యంలో పంపిణి చేయడం జరిగింది..

ఈ కార్యక్రమంలో చేయూత ప్రతినిధి బృందం కటుకం గణేష్, వాసాల గణేష్, యండి సనావోద్దీన్, జాల వినోద్ కుమార్, అల్లె రమేష్, చిరుమల్ల కన్నయ్య, గట్ల రమేష్, కొక్కుల రాజేష్ తదితరులు పాల్గొన్నారు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here