రాయికల్ తాజా కబురు రూరల్ న్యూస్: కరోనా మహమ్మారి, లాక్ డౌన్ నేపథ్యంలో ప్రభుత్వ అధికారుల తనిఖీలు ఉండవని గుట్టు చప్పుడుకాకుండా మండలం లోని చింతలూరు గ్రామంలోని చెరువు నుంచి కొందరు జేసీబీ వ్యాపారస్తులు స్వంత అవసరాల కోసం మట్టిపెరుతో మొరంను తరలిస్తున్నారు. ప్రభుత్వ భూమి అని తెలిసిన ప్రజా ప్రతినిధుల అండ దండలతో చెరువులోంచి మొరం, మట్టిని తోడేస్తూ రైతుల అవసరాలకని చెపుతూ అధికారుల కళ్ళు కప్పి ఒక్కో ట్రాక్టర్ ట్రిప్పు మొరం 400 రూపాయల నుండి 500 రూపాయల వరకు అమ్ముకుంటూ అక్రమంగా అందిన కాడికి దండుకుంటున్నారు.
గతంలో రాయికల్ పెద్ద చెరువు నుండి మట్టిని తరలిస్తూ నిల్వ చేస్తున్న మట్టి డంపులు ఫైల్ ఫోటో
గత సంవత్సరం జూన్ నెలలో రాయికల్ పెద్ద చెరువు నుంచి రైతుల పేరుతో అక్రమార్కులు మట్టిని తరలిస్తూ చెర్లకొండాపూర్, మైతాపూర్ రహదారి మార్గాలలో ఇటుకబట్టీల నిర్వహణ కోసం మట్టిని డంపులుగా పోసిన ఇప్పటివరకు ఆ మట్టిని అధికారులు సీజ్ చేయలేకపోయారు.వేసవి వచ్చిందంటే అక్రమార్కుల కళ్ళు చెరువులపై పడుతున్నాయి. ఇకనైనా అధికారులు రైతుల పేరుతో మట్టిని, మొరంను తరలించే వారిపై తగు చర్యలు తీసుకొని మట్టిని రైతులకు మాత్రమే తరలించే విదంగా ప్రభుత్వం, అధికారులు తగు ఏర్పాట్లు చేయాలనీ రైతులు కోరుతున్నారు.