చెత్తను పోగు చేయండి డబ్బులు సంపాదించండి

0
62

కోరుట్ల తాజా కబురు: పట్టణంలో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పొడి వనరుల సేకరణ కేంద్రాన్ని శుక్రవారం మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ ఆయాజ్ ప్రాంభించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ, కోరుట్ల పట్టణంలో గతంలో ఇంట్లో ఉన్న చెత్తను బయట పడేసేవారు..నేటి కాలంలో మున్సిపల్ నుండి వచ్చిన వాహనానికి అందిస్తున్నారు..కానీ ఇప్పుడు నిరుపయోగం లేని వస్తువులను పోగు చేస్తూ డబ్బులు సంపాదించుకునే వీలును మున్సిపాలిటీ కల్పించిందని అన్నారు.
ఈ కేంద్రం ద్వారా నిత్యం వాడి పడేసే వస్తువులను పోగు చేసి వాటిని విక్రయించుకోవచ్చన్నారు.వస్తువులను స్థానిక పొడి వనరుల కేంద్రానికి విక్రయించుకోవాలని మహిళా సమాఖ్యల ద్వారా చెత్త తీసుకువచ్చి డబ్బులు సంపాదించుకునే విధానం ఏర్పాటు చేశామన్నారు.
ఇంట్లో ఉపయోగంలేని నిత్యావరన వస్తువులైన, పాల ప్యాకెట్లు కవర్లు, నూనె ప్యాకెట్లు,నూనె డబ్బాలు,బీరు సీసాలు,వనరుల సేకరించి నేరుగా మహిళా సమాఖ్య ద్వారా ఒక బ్యాగ్ లో ఉంచి కేంద్రం ద్వారా విక్రయించుకుని డబ్బులు సంపాదించుకొనే ఆకాశం కల్పిస్తూ వినూత్న ఆలోచనకు రూపకల్పన చేశామన్నారు. కావున పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ గజానంద్,హెల్త్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్,ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ మహేష్ మహిళా సమైక్య సభ్యులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here