చివరి దశలో ఆస్ట్రాజెనెకా వాక్సిన్…కరోనాకు కళ్లెం పడెనా…

0
70
tajakaburu

వాషింగ్టన్: కరోనా మాహామ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తుంది,ఎప్పుడెప్పుడా అని ఎదిరిచూస్తున్న వాక్సిన్ ఇదిగో వస్తుంది, అదిగో వస్తుందని చెపుతూనె ఉన్నారు, అలానె రష్యా ఇప్పటికె కరోనా వాక్సిన్ రిలీజ్ చేసింది,మన భారత్ లో కూడా పలు కంపెనీ లు రెండవ దశలోకి చేరుకున్నట్టు చెపుతున్నారు, మరీ అన్నింట్లో సంపన్నదేశంగా చెప్పుకొనె అమెరికా కరోనా వాక్సిన్ తయారీ ఎక్కడివరకు వచ్చింది….ప్రపంచ దేశాలన్నిటినీ వణికిస్తున్న కోవిడ్‌-19 కట్టడికి అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్లను వీలైనంత వేగంగా అందుబాటులోకి తీసుకురావాలని అమెరికా ప్రభుత్వం ఆశిస్తోంది. ఇందుకు వీలుగా ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీ సహకారంతో బ్రిటిష్‌ దిగ్గజం ఆస్ట్రాజెనెకా రూపొందిస్తున్న వ్యాక్సిన్‌ ఏజెడ్‌డీ 1222 చివరి దశ క్లినికల్‌ పరీక్షలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీంతో నేటి నుంచి యూఎస్‌ సహకారంతో రెండు డోసేజీలు ఇవ్వడం ద్వారా 30,000 మందిపై వ్యాక్సిన్‌ను పరీక్షించనున్నట్లు తెలుస్తోంది. తద్వారా నవంబర్‌కల్లా వ్యాక్సిన్‌ను ప్రజలకు అందించాలని ప్రెసిడెంట్‌ డొనాల్డ్‌ ట్రంప్‌ ఆశిస్తున్నారు. ఆస్ట్రాజెనెకాతోపాటు.. బయోఎన్‌టెక్‌ భాగస్వామ్యంతో అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌ క్లినికల్‌ పరీక్షల డేటాను అక్టోబర్‌కల్లా విశ్లేషించే వీలున్నట్లు యూఎస్‌ దిగ్గజం ఫైజర్‌ తాజాగా పేర్కొంది.ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ ఇప్పటికే బ్రిటన్‌, బ్రెజిల్‌, దక్షిణాఫ్రికాలో చివరి దశ పరీక్షలలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. వీటికి జతగా జపాన్, రష్యాలోనూ పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. యూఎస్‌లో నిర్వహించిన మూడో దశ పరీక్షల సహకారంతో ప్రపంచవ్యాప్తంగా 50,000 మందిపై తుది దశ ప్రయోగాలు చేపట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here