చలిగల్ నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు

0
81

జగిత్యాల క్రైం తాజా కబురు: చలిగల్ వడ్డెర కాలనీకి చెందిన గొళ్ళెం నడిపి రాజ0 (60) అతని మేనల్లుడు అయిన శివరాత్రి అంజయ్య(40) మధ్య గత కొంత కాలంగా కుటుంబ కలహాలు చోటుచేసుకున్నాయని ఈ క్రమంలో నడిపి రాజం కు మంత్రాల రావడం వల్లనే తన కుటుంబం అనారోగ్యానికి గురికావడం జరుగుతుందని కక్ష పెంచుకున్న శివరాత్రి అంజయ్య తన మేనమామ అయినా నడిపి రాజ0 ను ఆదివారం సాయంత్రం చలిగల్ వడ్డెర కాలనీ బస్టాండ్ దగ్గర అందరూ చూస్తుండగానే వెనుకనుండి వచ్చి కత్తితో పొడవడం జరిగినది రక్తం మడుగులో ఉన్న అతను అక్కడికక్కడే చనిపోవడం జరిగిందని మృతుని భార్య రాజమ్మ ఇచ్చిన పిర్యాదు మేరకు క్రైమ్ నెంబర్ 359/2020 అండర్ సెక్షన్ 302IPC కేసు నమోదు చేసి దర్యపు ప్రారంభించి నిందితుడు శివరాత్రి అంజయ్య ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించడం జరిగిందని రూరల్ సిఐ రాజేష్ తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here