ఘనంగా పీవీ జయంతి వేడుకలు

0
158

తాజా కబురు జగిత్యాల,రాయికల్: జిల్లా వ్యాప్తంగా మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు శత జయంతి ఉత్సవాలను ప్రభుత్వ కార్యాలయాల్లో,అధికారుల, పలు నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆదివారం జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో పి.వి.నరసింహ రావు చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గుగులోత్ రవి, జాయింట్ కలెక్టర్ రాజేశం, అదనపు ఎస్పి దక్షిణ మూర్తి, ఎమ్మెల్యే సంజయ్ కుమార్, జెడ్పి చైర్ పర్సన్ దావా వసంత సురేష్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, పాల్గొన్నారు.

జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయములో అదనపు ఎస్పీ దక్షిణా మూర్తి పి.వి. నరసింహారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు గారు తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తి అని,బహుభాషా కోవిదుడు అని ఆర్థిక,భూ సంస్కరణలకు మూలకర్త అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో రిజర్వుడు ఇన్స్పెక్టర్ లు వామన మూర్తి, నవీన్,సైదులు, పట్టణ సి.ఐ జయేష్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.


రాయికల్ తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ మహేశ్వర్ పి.వి. నరసింహారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.


రాయికల్ మున్సిపాలిటీ లో మున్సిపల్ పాలక వర్గం ఆధ్వర్యంలో పి.వి. నరసింహారావు చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం చైర్మన్ మోర హన్మాండ్లు మాట్లాడుతూ దేశానికి ప్రధాని అయిన మొదటి తెలంగాణ బిడ్డ అని,గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థ ను ఆర్థిక సంస్కరణలతో దేశ ఆర్థిక వ్యవస్థ ను తిరిగి దారిలో పెట్టిన ఆర్థిక మేధావి అని,14 భాష లో ప్రావీణ్యం ఉన్న వ్యక్తి అని,సంకీర్ణ ప్రభుత్వాన్ని పూర్తికాలం నడిపిన అపార చాణక్యుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ రమాదేవి,కౌన్సిలర్లు మ్యాకల కాంతారావు,మహేందర్, సాయికుమార్, శ్రీధర్ రెడ్డి, మహేష్ నాయకులు అచ్యుతరావు, హుస్సేన్ పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here