గ్రామ పంచాయితీలకు ప్రతిమ ఫౌండేషన్ మాస్క్ ల వితరణ

0
213

రాయికల్ తాజా కబురు:మండలం లోని చెర్ల కొండపూర్, రామారావు పల్లె, మైతాపూర్ గ్రామాల సర్పంచ్ లకు ఆదివారం ప్రతిమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మండల ఆర్గనైజర్ నాగిరెడ్డి రఘుపతి రెడ్డి మాస్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని,జలుబు,దగ్గు,జ్వరం వంటి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలని,గ్రామీణ రైతులకు,రైతు కూలీలకు కరోనా వైరస్ వ్యాప్తి అరికట్టడానికి ముందు జాగ్రత్తగా ప్రతిమ పౌండషన్ ఆధ్వర్యంలో తెలంగాణ లో కోటి ఉచిత మాస్క్ ల పంపిణీయే ధ్యేయంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని, మండలంలోని రిజిస్ట్రేషన్ చేసుకున్న ఆయా గ్రామాల్లోని సర్పంచులకు మూడు రోజుల్లోనే మొదటి విడుతగా 3000 మాస్కులు పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు ఎ. రాజ్యలక్ష్మి ఎన్.తిరుమల్ ఎం.డి అజారుద్దీన్ ఉప సర్పంచ్ లు, వార్డు సభ్యులు, పంచాయితీ సిబ్బంది పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here