51లక్షల 65వేల గ్రామ పంచాయతీ నిధుల వివరాలు ఏవి…?

0
771

51లక్షల నిధుల వివరాలు తెలియదా…..?

స.హ దరఖాస్తు చేస్తే ఇక్కడ ఎందుకు అడుగుతున్నావు ఎంపీడీవో ను అడుగు అని ఓ ప్రజా ప్రతినిధి సమాధానం

తాజా కబురు జగిత్యాల రూరల్ :జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో శనివారం గ్రామ సర్పంచ్ మూల సుమలత అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఆకస్మిక గ్రామ సభలో పంచాయతీ లెక్కలు చెప్పాలని బుగ్గారం గ్రామ ప్రజలు నిలదీశారు. దీనికి పంచాయతీ కార్యదర్శి నరేందర్ పొంతన లేని సమాధానాలు చెపుతుండగా, సరైన సమాధానం ఎందుకు చెప్పడం లేదని ప్రజలు మండిపడ్డారు. ప్రజల సమస్యలు తీర్చాల్సింది పోయి ఓ వార్డు సభ్యుడు లెక్కలను ప్రక్క దారి పట్టించేందుకు మధ్యలో దూరి రెచ్చిపోయి ప్రవర్తించారు. అతని ప్రవర్తనను గమనించిన బుగ్గారం గ్రామ ప్రజలు లెక్కలు చెప్పాల్సింది పంచాయతీ కార్యదర్శి అయితే మీరెందుకు లొల్లి చేస్తూ జోక్యం చేసుకుంటున్నారని గ్రామస్తులు ముక్తకంఠంతో ప్రశ్నించగా వార్డు సభ్యుడు వెనక్కి తగ్గారు. కాగా కావాలనే పాలక వర్గం ఆ వార్డు సభ్యున్ని రెచ్చగొట్టారని, లెక్కలు తేలితే తమ బండారం బయట పడుతుందని గొడవకు దారి తీసే ప్రయత్నంలో భాగంగానే ఒక వార్డు సభ్యున్ని ఆ విధంగా రెచ్చగొట్టి ఉంటారని ప్రజలు అనుమానాలను వ్యక్తం చేశారు. అవసరం అయితే గట్టిగా లెక్కలు అడిగిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయవచ్చు అనే కుట్రకు పాలకులు పాల్పడినట్లు తెలుస్తోందని బుగ్గారం ప్రజలు ఆరోపించారు. ఇదే గ్రామ సభలో గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు చుక్క గంగారెడ్డి మాట్లాడుతూ గత ఆర్థిక సంవత్సరం ఆడిట్ రిపోర్ట్ లో చూపిన విధంగా ఇతర ఖర్చులు, ఇతరత్రా అంశాలతో ఖర్చు చూపిన రూ.51,65,310 (యాభై ఒక్క లక్ష అరవై ఐదు వేల ఆరువందల పది రూపాయలకు) కి సంబంధించిన అభివృద్ధి పనుల వివరాలను తెలపాలని కోరారు. దీనికి పంచాయతీ కార్యదర్శి నుండి సరైన జవాబు రాకపోవడమే కాకుండా రికార్డులు అందుబాటులో లేవని దాటవేశారు. దీనితో బుగ్గారం గ్రామ ప్రజల్లో నెలకొని ఉన్న నిధుల “‘గోల్ మాల్”‘ అనుమానాలకు మరింత భలం చేకూరినట్లయింది. రికార్డులు ఎందుకు లేవని, లేకపోతే వాటికి బాధ్యులు ఎవరని ప్రజలు నిలదీశారు. మండల పాలక వర్గంలో బాధ్యత వహిస్తున్న ఒక ప్రజా ప్రతినిధి గ్రామ సభలో
జోక్యం చేసుకొని మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం ద్వారా పోయిన వారు ఎంపీడీవో ను అడగాలి కానీ, ఇక్కడ ఎందుకు అడుగుతున్నారని అన్నారు. మేము గ్రామ పౌరులం, అడిగే హక్కు మాకు ఉందని, మేము ఎంపీడీవో ను అడిగిన సమాచారమే అసంపూర్తిగా, తప్పుల తడకతో కూడిన సమాచారం పంచాయతీ కార్యదర్శి నరేందర్ ఇచ్చారని, పూర్తి సమచారం ఎందుకు ఇవ్వలేదని ప్రజలు నిలదీయడంతో ఆ ప్రజా ప్రతినిధి ముఖం చాటేశారు. బుగ్గారం గ్రామంలో శిలాపలకాలు వేసి ఆగిపోయిన పలు అభివృద్ధి పనుల గురించి ప్రజలు ప్రజా ప్రతినిధులను నిలదీశారు. వర్షాలకు గ్రామంలోని వీధి రోడ్లన్నీ బురదమయం అయ్యాయని, నిధులు వచ్చి ఏండ్లు గడుస్తున్నా, శిలాపలకాలు వేసి కూడా సిసి రోడ్లు ఎందుకు వేయడం లేదని తీవ్రంగా మండిపడ్డారు. పలు ప్రాంతాలలో మొరం పోయాలని, కరంట్ స్తంభాలు వేసి, వీధి లైట్లు ఏర్పాటు చేయాలని గ్రామ ప్రజలు కోరారు.
గ్రామ సర్పంచ్ మూల సుమలత అధ్యక్షతన జరిగిన
ఈ గ్రామ సభలో మండల పరిషత్ ఉపాధ్యక్షులు జోగినిపెళ్లి సుచెందర్ రావు, ఉప సర్పంచ్ చుక్క శ్రీనివాస్, మండల పరిషత్ కో -ఆప్షన్ సభ్యులు ఎం.ఏ.రహమాన్, వార్డు సభ్యులు పొన్నం శంకర్, నగునూరి రామకృష్ణ, నక్క జితేందర్, సామియేల్, బొడ్డు సరోజన, విద్యాకమిటి చైర్మన్ మూల శ్రీనివాస్, తెరాస గ్రామ శాఖ అధ్యక్షుడు ధసర్తి పూర్ణచందర్,కాంగ్రెస్ నాయకులు పెద్దనవేని శంకర్, నగునూరి నర్సాగౌడ్, నగునూరి పెద్ద రామగౌడ్, రాజన్న, తెలుగుదేశం పార్టీ నాయకులు పెద్దనవేని రాఘన్న, బిజెపి నాయకులు సుంకం ప్రశాంత్, గొండ వెంకటేష్, కప్పల మల్లేష్, భారతపు గంగాధర్, గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, బొడ్డు లక్మన్, రాజిరెడ్డి, జంగ మల్లేష్, అంగన్ వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, మహిళలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here