గ్రామ గ్రామాన అభివృద్ధి కమిటీల ఏర్పాటు

0
45

మండల అభివృద్ధి కోసం ఎండిసి బలోపేతం

జగిత్యాల తాజా కబురు:జగిత్యాల జిల్లా బుగ్గారం మండల అభివృద్ధి సాధనకోసం మండల అభివృద్ధి కమిటీని బలోపేతం చేస్తూ మండలంలోని అన్ని గ్రామాలలో అభివృద్ధి కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు మండల అభివృద్ధి కమిటీ కన్వీనర్ ఎన్నం కిషన్ రెడ్డి, కో – కన్వీనర్ చుక్క గంగారెడ్డి లు తెలిపారు. శనివారం వారు పాత్రికేయులతో మాట్లాడుతూ బుగ్గారం మండలంలోని వివిధ గ్రామాల నుండి వస్తున్న ఆక్షేపణలు, అభ్యర్థనలు, కుంటుపడుతున్న అభివృద్ధి పట్ల, రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్, ఇతర ప్రజా ప్రతినిధులు, అన్ని పార్టీల నాయకుల సహకారంతో మండలాన్ని మరింత అభివృద్ధి పరుచాలని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. బుగ్గారం మండలంలోని ప్రతి గ్రామంలో త్వరలోనే అభివృద్ధి కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. అన్ని గ్రామాల నుండి మండల ప్రతినిధులను కూడా ఎంపిక చేసి మండల అభివృద్ధి కమిటీ ని పూర్తి స్థాయిలో నియమించి బలోపేతం చేస్తామన్నారు. మండలంలో గల విద్య, వైద్యం, ఆరోగ్యం, రైతు సమస్యలపై, ఇతరత్రా ప్రజా సమస్యలపై స్పందించి వాటి పరిష్కార దిశలో ఈ కమిటీలు కృషి చేస్తాయని వారు సూచించారు. రాజకీయాలకు అతీతంగా ఏర్పడే ఈ కమిటీల నియామకానికి మండలంలోని ప్రతి పౌరుడు సహకరించి ఆయా గ్రామాల అభివృద్ధితో పాటు మండల అభివృద్ధికి కూడా తోడ్పాటు నందించాలని వారు కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here