గ్రామాల్లో పరిశుభ్రత పై దృష్టి సారించాలి -ఎంపీపీ లావుడ్యా సంధ్యారాణి

0
138

రాయికల్ తాజా కబురు రూరల్ : పల్లెలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని ముఖ్యమంత్రి కే.సీ.ఆర్ ప్రారంభిచిన పల్లె ప్రగతి కార్యక్రమం విజయవంతం చేయాలి : ఎంపీపీ లావుడ్యా సంధ్యారాణి సురేందర్ నాయక్ అన్నారు.సోమవారం పల్లె ప్రగతిలో భాగంగా ఆల్యా నాయక్ గ్రామ పంచాయితీ పరిధిలో ఎంపీపీ పాదయాత్ర చేస్తూ గ్రామంలో పరిశుభ్రత పై దృష్టి సారించాలని గ్రామ కార్యదర్శికి సూచించారు.అందరు ఇంకుడు గుంతలు నిర్మించుకునే విదంగా చర్యలు తీసుకోవాలని, వర్ష కాలం ప్రారంభం కానున్న నేపథ్యంలో డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు సోకకుండా ఉండాలంటే గ్రామ పరిసరాల్లో ఉన్న మురికి కాలువలను ఎప్పటికప్పుడు పూడిక తీసి వేయాలని అన్నారు.
అనంతరం మాస్కులు పంపిణి చేస్తూ కరోనా మహమ్మారి వల్ల రాష్ట్రం, దేశం అతలకుతాలమౌతున్నా తరుణంలో మనమందరం ప్రభుత్వం సూచిస్తున్న జాగ్రత్తలు పాటిస్తూ, మాస్కులు ధరించడం, వ్యక్తిగత పరిశుభ్రత, భౌతిక దూరాన్ని పాటించాలని గ్రామస్తులను కోరారు.ఈ కార్యక్రమంలోగ్రామ కార్యదర్శి రాజశేఖర్, గ్రామ సర్పంచ్ నందు, వార్డుమెంబర్లు, శ్రీరామ్, అనిత, కో-అప్సన్ సభ్యుడు రాజేష్, గ్రామ మహిళలు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here