కేక్ కట్ చేసిన కిష్టంపేట సర్పంచ్
ఏఎన్ఎం, ఆశ వర్కర్లకు సన్మానం చేసిన ఇటిక్యాల సర్పంచ్
రాయికల్ తాజా కబురు: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం మండలంలోని కిష్టంపేట, సింగర్రావుపేట, మైతాపూర్, చెర్లకొండాపూర్, అల్లీపూర్, ఇటిక్యాల తదితర గ్రామా పంచాయతీల వద్ద ఆయా గ్రామాల సర్పంచులు జాతీయ జెండాలను ఎగరవేశారు. కిష్టంపేట గ్రామ పంచాయితీ వద్ద సర్పంచ్ జాన స్వరూపగోపి కేక్ కట్ చేసి రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను చేసుకోగా, ఇటిక్యాల గ్రామ సర్పంచ్ సామల్ల లావణ్య వేణు గ్రామ ఏఎన్ఎం, ఆశ వర్కర్లకు సన్మానం చేశారు.ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల పంచాయితీ కార్యదర్శులు,ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్ లు, ఉపసర్పంచ్ లు, వార్డు సభ్యులు, పంచాయితీ సిబ్బంది పాల్గొన్నారు.