గుట్కా వ్యాపారస్తులకు చివరి హెచ్చరిక

0
102

ప్రభుత్వ నిషేధిత పొగాకు ఉత్పత్తుల నియంత్రణకు పకడ్బందీ చర్యలు-జిల్లా ఇన్చార్జ్ ఎస్పీ కరీంనగర్ పోలీస్ కమిషనర్ వి.బి కమలాసన్ రెడ్డి

గుట్కా అమ్ముతూ,సరఫరా చేస్తూ రెండవసారి పట్టుపడ్డ వారిపై సస్ఫెక్ట్ షీట్లు

జగిత్యాల తాజా కబురు:గుట్కా, ఇతర నిషేధిత పొగాకు ఉత్పత్తుల విక్రయ నియంత్రణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఇన్చార్ట్ఎస్పీ కరీంనగర్ పోలీస్ కమిషనర్ వి.బి కమలాసన్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.2020 సంవత్సరం జనవరి నుండి ఇప్పటివరకు గుట్కా, ఇతర నిషేధిత పొగాకు ఉత్పత్తుల విక్రయాల, రవాణాకు పాల్పడినవారిపై 99 కేసులను నమోదుచేసి 150 మందిని అరెస్ట్ చేయడంతో పాటు 37లక్షల 12వేల 494 రూపాయల విలువ చేసే వివిధ రకాల పొగాకు ఉత్పత్తులనుస్వాధీనం చేసుకున్నామని, 2019 సంవత్సరంకు సంబంధించి గుట్కా, ఇతర నిషేధిత పొగాకు ఉత్పత్తుల విక్రయాలు,రవాణాకు పాల్పడిన వారిపై 143 కేసులను నమోదు చేసి 210 మందిని అరెస్ట్ చేయడంతో పాటు 41లక్షల,54 వేల 807రూపాయల విలువ చేసే వివిధ రకాల పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నామని,వరుస దాడులు కొనసాగించడం వల్ల జిల్లాలో చాలా వరకు గుట్కా విక్రయాలు నియంత్రణలోకి వచ్చాయని ఈ మధ్యకాలంలో కొందరు వ్యాపారులు గుట్టుచప్పుడు కాకుండా మళ్ళీ విక్రయాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం ఉందని,గుట్కాను తమ వద్ద నిల్వ ఉంచుకునే వ్యాపారులు వెంటనే ఆ నిల్వలను దగ్ధం చేయాలని లేనట్లయితే కేసులు నమోదు చేస్తామని,గుట్కా అమ్ముతు లేదా సరఫరా చేస్తూ రెండవసారి పట్టుపడ్డ వారిపై సస్ఫెక్ట్ షీట్లు ఓపెన్ చేయడం జరుగుతుంది అని తెలిపారు.ఈ సస్ఫెక్ట్ షీట్లు ఉన్న వారు వారానికి ఒకసారిపోలీస్ స్టేషన్లో హాజరు కావాల్సి ఉంటుందని, గుట్కా విక్రయాలు జరిపి ప్రజల జీవితాలతో చెలగాటం ఆడటంసరైనది కాదన్నారు. గుట్కా వ్యాపారుల కు ఇదే చివరి హెచ్చరికని స్పష్టం చేశారు. గుట్కా ఇతర నిషేధిత పొగాకుఉత్పత్తులను విక్రయించే వ్యాపారులకు సంబంధించిన సమాచారం అందించాలని కోరారు. సమాచారం అందించే వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని, నిషేధిత గుట్కా ఇతర పొగాకు ఉత్పత్తుల విక్రయ,సరఫరా విషయంలోప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉన్న వారిపై చర్యలు తీసుకుంటున్నామని ఇతర రాష్ట్రాల నుండి గుట్కాను తెస్తున్న మూటలపై ప్రత్యేక సమాచారం ఏర్పరచుకొని ప్రతి నెల స్పెషల్ డ్రైవ్ లు నిర్వహిస్తూ అక్రమ కార్యకలాపాలను
అడ్డుకుంటామని అన్నారు.

గుట్కా నిషేధిత పొగాకు ఉత్పత్తులు తినడం వల్ల క్యాన్సర్ వ్యాధి బారిన పడుతున్నారని,గుట్కా ఇతర నిషేధిత పొగాకు ఉత్పత్తులను సేవించడం వల్ల కలిగే దుష్పరిణామాలు పై పోలీస్ కళాబృందం వారిచే అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here