గుండు పిన్ను పై గురు శిష్యుల అనుబంధం-సూక్ష్మ కళాకారుడు డాక్టర్ గుర్రం దయాకర్

0
145

తాజా కబురు జగిత్యాల:నవ నాగరిక సమాజంలో ఆయనో సాధారణ మనిషి…ఐనా ఆదియుగం నుండీ ఆధునిక శకం వరకూ ఆయనే ఋషి….జాతి జీవన వికాస మార్గదర్శకుడతడు…సమాజ దేవాలయానికి సిసలైన పురోహితుడు. అతడే …ఉపాధ్యాయుడు – సృష్టి స్థితి లయల నిర్దేశకుడు..సెప్టెంబర్ 5 సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకుని దేశమంతా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటోంది.

సూక్ష్మ కళాకారుడు డాక్టర్ గుర్రం దయాకర్

ఈ సందర్బంగా గురు శిష్యుల అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ జగిత్యాల తులసి నగర్ కు చెందిన సూక్ష్మ కళాకారుడు డాక్టర్ గుర్రం దయాకర్ పాఠశాల ముందు ప్రకృతి ఒడిలో ఓ చెట్టు కింద శిష్యుడు గురువు పాదాలను తాకుతూ దీవెనలు తీసుకుంటున్న సన్నివేశాన్ని నైలాన్, రంగులతో 12 గంటల పాటు శ్రమించి 4×6 మిల్లి మీటర్ సైజులో బియ్యపు గింజ కన్నా తక్కువ పరిమాణంలో తయారు చేసి ఈ రూపాన్ని ఉపాధ్యాయులకు అంకితం చేస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు.

గతంలో బంగారంతో అత్యంత సూక్ష్మమైన విగ్రహాలు తయారుచేసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో మూడు గోల్డ్ మెడల్ లు, వరల్డ్ రికార్డు యూనివర్సిటీ చే గౌరవ డాక్టరేట్ పట్టా,కలాం వరల్డ్ రికార్డ్,కలాం విజన్ 2020 స్పెషల్ అవార్డులనే కాకుండా ఐదు ఇంటర్ నేషనల్ రాయల్ సక్సెస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ను దయాకర్ సాధించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here