గిరిజనులకు నిత్యావసర సరుకులు అందజేసిన అక్షర సైనికుడు

0
168

రాయికల్: మండలంలోని దావన్ పల్లి, గోండు గూడెం తాండా ప్రాంతాలలో నివసిస్తున్న 25 గిరిజన కుటుంబాలకు రాయికల్ పట్టణానికి చెందిన పాత్రికేయుడు కడకుంట్ల జగదీశ్వర్ ఆదివారం తన  సొంత ఖర్చుతో నిత్యావసర సరుకులు బియ్యం, నూనె, కూరగాయలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాటి మనిషికి తన వంతుగా సాయం చేయడం మానవత్వానికి ప్రతీక అని, సేవలు అందించడం ద్వారా ఆనందం లభిస్తుందని అన్నారు. అలాగే తాను చేస్తున్న ప్రతి సేవ కార్యక్రమంలో తోటి పాత్రికేయ మిత్రులు ఎద్దండి ముత్యపు రాజు రెడ్డి, కనికరపు లక్ష్మణ్, వాసం లింబాద్రి, ముంజ ధర్మపురి గౌడ్,అనుపురం లింబాద్రి గౌడ్ లు తమ వంతుగా సహకారం అందిస్తున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో చింతకుంట సాయికుమార్, మల్లేశం,తిరుపతి, వెంకటేష్ ,తదితరులు పాల్గొన్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here