గాయత్రీ గోశాలలో కరోనా వ్యాధి నివారణ యజ్ఞం

0
212

రాయికల్ రూరల్ తాజా కబురు: యావత్ ప్రపంచ మానవాళిని పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ వ్యాధి నిర్మూలనకై మండలంలోని కుమ్మరిపెల్లి గ్రామంలో గల గాయత్రీ గోశాలలో గురువారం రోజున కరోనా నివారణ యజ్ఞాన్ని వేద పురోహితులు డాక్టర్ రేగొండ కమలాకర్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామం నుండి మొదలుకొని ప్రపంచ మానవాళికి రోగ నిరోధక శక్తి పెరగాలని,తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కరోనా వ్యాధి నిర్మూలనకై పోరాడుతున్న వైద్య ఆరోగ్య, రెవెన్యూ, పోలీస్, విద్యుత్తు, పారిశుద్ధ్య కార్మికులు, జర్నలిస్టులందరికి ఆయురారోగ్యాలు కలగాలని భౌతిక దూరాన్ని పాటించి యజ్ఞం నిర్వహించామని తెలిపారు.

ఈ యజ్ఞ కార్యక్రమంలో గాయత్రీ గోశాల నిర్వాహకులు సామల్ల బుచ్చన్న ,మాజీ సర్పంచ్ ఉడుత నందయ్య ,సీనియర్ పాత్రికేయులు ముంజ ధర్మపురి గౌడ్,కుంబోజి రవి,చింత రాజేందర్ తదితరులు పాల్గొన్నారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here