గల గల మోగే మువ్వ ఈ నూరేళ్ల లస్మవ్వ..లంబాడీపల్లిలో ….ఆ ముసలవ్వకు నూరేళ్ల పుట్టిండ్రోజు ఏడుకలు…

0
15
tajakaburu news
tajakabururu

 

గడ్క,అంబలి,సద్దన్నం ఇవి ఆ ముసలవ్వ దినాం తింటుండె ,ఎంత గొడ్డుకట్టం చేసినా అల్సివోవడం అన్నది తెల్వదు ఆ పెద్దవ్వకు,రాటుగొట్టింది,గూడగట్టింది,యాతంబోసింది,నెత్తిమీద పెద్ద కల్లుబుంగవెట్టుకొని, రెండుచేతులల్ల కొబ్బలువట్టుకొని మైళ్లకు మైళ్లు నడిచి కల్లమ్మింది, అయినా ఆ పెద్దవ్వకు యాట్టరాలేదు, గా తిండి గట్టుండె మరీ,గా అవ్వకు  గిప్పుడు నేరేళ్ల  పుట్టిన్రోజు పండగను ఇంటోల్లందరు దగ్గరుండి మరీ చేసిండ్రు...

tajakaburu Reporter

 

ఈ ముచ్చటంత ఎవ్వలతో తెస్సా, గా గక్కడికెఅత్తున్నా…జైతాల జిల్లా మల్యాల మండలం లంబాడీపల్లి ఊరికి యందిన గీ పంక్,పంక్ ముసలవ్వకు పుట్టినరోజు చేసిండ్రు మనవలు మనవరాల్లు, కుటుంబపోల్లు, గదెందుకంటె గీ ముసలవ్వ వుట్టి ఇయ్యల్లట్టికి నూరు ఏళ్లైందట, పొన్నం గంగారాం, లస్మవ్వలకు పదుగురు పుట్టిండ్రు, ఆండ్ల అయిదుగురు ఆడోళ్లు, అయిదుగురు మగోళ్లు,  గీళ్లు ఆల్ల కస్పి ఈదుళ్లుగీసుడు జేసుకుంట పిల్లగాండ్లను పెంచి పెద్దజేసిండ్రు, ఓలింటికి ఆల్లనునిచ్చిండ్రు,గిట్ల నడుత్తున్నండగా 20 ఏళ్లకింద ముసలవ్వ పెనిమిటి బిత్తరుకట్టిండు,గప్పడిసింది లస్మవ్వనె ఇల్లును ఎల్లదీసుకుంటు అచ్చింది,  ఇగా కొడుకులను,కోడల్లనుజూసుకుంటు బతికింది లస్మవ్వ, అటీటని ముని మన్వల్లు,మన్వారాళ్లు అచ్చిండ్రు,గాల్లను జూసుకుంటు పైనున్న తాతను దల్చుకుంటు కాలం యలదీత్తుంది లస్మవ్వ,అవ్వకు నూరెళ్లు నిండినాయని ఆడోకల్లు, ఈడోకల్లు ఉన్నోళ్లందరు లస్మవ్వకాడికొచ్చి వాలిపోయిండ్రు, ఇయ్యల్ల పెద్ద పండగనెజేసిండ్రు, ముసలవ్వ పెనిమిటిని కట్టుకున్నప్పుడైన గింతపెద్దగా జేసిండ్రో లేదోగానీ గిప్పుడుమాత్రం గమ్మతు జేసిండ్రు అందరు లస్మవ్వకు కొత్త గోసిచీర కట్టిపిచ్చి మెడల మెడగుండ్లు వెయంచి, కేక్ తెచ్చి నూరు ఏళ్ల యడుకలు జరిపిండ్రు కేకును కోపిచ్చిండ్రు, అందరు లస్మవ్వతో దీవనార్తులు తీసుకున్నరూ

tajakaburu

…ఏమైనా లస్మవ్వ నువ్వు నిజంగా గి..ర్రేట్,,, ఇంకో ముచ్చట చెప్పాలయ్యా గీ ముసలవ్వకు గిప్పడికి చెవులు సక్కడ ఇనబడుతాయట, మంచిగా మాట్లడుతాదట, ఇచిత్రమేంటంటె బియ్యంలా పురుగులుకూడా ఏరిపారేత్తదట ఇది ఇచిత్రమె కదా మరీ…మనం సూడా అవ్వకు వందెళ్ల హ్యవి బర్తు డె సెప్పుదాం..

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here