గల్వాన్ ఘటనలో గాయపడిన సైనికులను పరామర్శించిన మోడీ

0
183

తాజా కబురు హైదరాబాద్ డెస్క్ : గల్వాన్ ఘటనలో గాయపడిన జవాన్లను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం పరామర్శించారు. నాటి ఘటన గురించి నేరుగా సైనికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. జవాన్ల భుజం తట్టి వారి ధైర్య సాహసాలను మెచ్చుకున్నారు. లడక్ గల్వాన్ లోయలో జూన్ 15న బలగాల ఉపసంహరణ సమయంలో చైనా బలగాలు కుట్రపూరితంగా వ్యవహరించి కల్నల్ సంతోష్ బాబు సహా 20 మంది జవాన్లను పొట్టన పెట్టుకున్నారు. ఈ ఘటనలో చైనా సైనికులు పెద్ద సంఖ్యలో చనిపోయినా డ్రాగన్ దేశం ఇప్పటివరకు వివరణ ఇవ్వలేదు. 45 మందివరకు చనిపోయారని జాతీయ స్థాయిలో కథనాలు వచ్చినా చైనా స్పష్టం చేయలేదు. గల్వాన్ ఘటన తర్వాత భారత్-చైనా మధ్య ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. వాస్తవాధీన రేఖ వెంబడి వేలాది మంది సైనికులను రెండు దేశాలు మోహరించాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here