గణేష్ నవరాత్రి ఉత్సవాల పై తెరాస సర్కార్ ఆంక్షలు నిర్బంధాలకు వ్యతిరేకంగా నిరసనలు

0
119

తాజా కబురు జగిత్యాల: రాష్ట్ర వ్యాప్తంగా గణేష్ నవరాత్రి ఉత్సవాల పై తెరాస ప్రభుత్వం ఆంక్షలు, నిర్బంధాలు విధించిన తీరుపై విశ్వహిందూ పరిషత్ సోమవారం చేపట్టిన నిరసనలకు సంపూర్ణ మద్దతుగా జగిత్యాల జిల్లా వ్యాప్తంగా భాజపా నాయకులు సంపూర్ణ మద్దతు తెలిపారు. జిల్లా కేంద్రంలో భాజపా నియోజకవర్గ ఇన్చార్జి ముదుగంటి రవీందర్ జిల్లా అధికార ప్రతినిధి చిలకమర్రి మదన్ మోహన్ ఆధ్వర్యంలో ప్లకార్డులు నల్లబ్యాడ్జీలు ధరించి కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలిపి వినతిపత్రం అందించారు. భాజపా జిల్లా కిసాన్మోర్చా అధ్యక్షులు కొడి పల్లి గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో కథలాపూర్ మండల కేంద్రంలో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపి తాహసిల్దార్ కు వినతిపత్రం అందించారు. రాయికల్ పట్టణంలో హిందు వాహిని, విశ్వహిందూ పరిషత్ మరియు భాజపా జిల్లా ఉపాధ్యక్షులు బోడగం మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అంగడి బజార్లో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. మండలంలోని రామోజీ పేట లో ఎంపీటీసీ సభ్యులు ఆకుల మహేష్, హిందు వాహిని సభ్యులు ప్లకార్డులతో నిరసన తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here