క్రీడల వలన స్నేహ భావం పెంపొందుతుంది-జిల్లా ఎస్పీ సింధు శర్మ

0
161

జగిత్యాల తాజా కబురు: దివంగత అడిషనల్ ఎస్పీ దక్షిణామూర్తి స్మారకార్థం జిల్లా పోలీస్ శాఖ అధికారులకు, సిబ్బందికి స్పోర్ట్స్ మీట్ కార్యక్రమాన్ని పట్టణంలోని స్వామి వివేకానంద మినీ స్టేడియంలో జిల్లా ఎస్పీ సింధు శర్మ ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా మొదట మినీ స్టేడియం నుoడి మొదలుకొని కొత్త బస్ స్టాండ్ వరకు, కొత్త బస్ స్టాండ్ నుoడి మినీ స్టేడియం వరకు 3 కి. మిల పరుగు పందేన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కరోన మహమ్మారి నియంత్రణ లో భాగంగా పోలీస్ శాఖ ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉంటూ ప్రైమరీ కాంటాక్ట్ ట్రేసింగ్,ఇతర రాష్ట్రాల నుoడి వచ్చే వారిని ఐసోలేషన్ లో ఉంచడం,వలస వెళ్లే వారికి సహాయాన్ని అందించడంలో జిల్లా పోలీస్ శాఖ చాలా బాగా పని చేశారని, కరోన వైరస్ ను ఎదుర్కొనే క్రమంలో భాగంగా చాలా మంది పోలీసులు వైరస్ బారిన పడి కోలుకోవడం జరిగిందని, దురదృష్టవశాత్తు అదనపు ఎస్పీ గా పనిచేసిన దక్షిణా మూర్తి మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం అన్నారు. క్రీడలతో స్నేహ భావం పొందడంతో పాటుగా, శారీరక సామర్థ్యాన్ని పెంపొందిచుకోవటం, పని ఒత్తిడి తగ్గటానికి క్రీడలు దోహదపడుతాయని అన్నారు.గత సంవత్సరం దివంగత అదనపు ఎస్పీ ఆధ్వర్యంలో జిల్లా మొదటి స్పోర్ట్స్ మీట్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నామని, దురదృష్టవశాత్తు కరోన బారినపడి అదనపు ఎస్పీని కోల్పోవడం జరిగిందని అన్నారు.కోవిడ్ నిబంధనలు దృష్టిలో పెట్టుకొని నాన్ కాంటాక్ట్ ఆటలకు ఎక్కువగా ప్రాముఖ్యత ఇవ్వడం జరిగిందని, ఇందులో భాగంగా షార్ట్ ఫుట్ రన్నింగ్, షటిల్,లాంగ్ జంప్ వంటి శారీరక సామర్థ్యము పెంపొందే ఆటలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి ఈ స్పోర్ట్స్ మీట్ ను నిర్వహించడం జరిగిందని తెలిపారు.స్పోర్ట్స్ మీట్ లో పాల్గొనడం ద్వారా పోలీస్ అధికారులకు,సిబ్బందికి మధ్య స్నేహభావం పెంపొందుతుందని అన్నారు. క్రీడలలో పాల్గొన్న పోలీస్ సిబ్బందికి ఎస్పీ మెడల్స్ ని అందించారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ సురేష్ కుమార్, డీఎస్పీ లు వెంకటరమణ, గౌస్ బాబా, ప్రతాప్, జిల్లాలోని పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here