కోవిడ్-19 నిర్దారణ పరీక్షల వివరాలను ఖచ్చితంగా ఆన్ లైన్ లో నమోదు చేయాలి-జిల్లా కలెక్టర్

0
125

తాజా కబురు జగిత్యాల టౌన్: రోజురోజుకు కోవిడ్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్న దృశ్యా ప్రతిరోజు కచ్చితంగా 1500 ర్యాపిడ్ పరీక్షలను నిర్వహించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం జారి చేసిన ఆదేశాలను జిల్లా అధికారులు ఆచరణలో పెట్టి శుక్రవారం సాయంత్రానికి 1468 కోవిడ్ నిర్దారణ పరీక్షలు నిర్వహించడం జరిగిందని, జిల్లా కలెక్టర్ జి. రవి వైద్య శాఖ సిబ్బందిని అభినందించారు. ఈ సందర్బముగా జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి వైద్యశాఖ అధికారులతో జూమ్ వెబ్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య, సామాజిక అరోగ్య కేంద్రాలతో పాటు జిల్లా ఆసుపత్రిలో నిర్వహించే కోవిడ్ నిర్దారణ పరీక్షల వివరాలను ఖచ్చితంగా ఆన్ లైన్ లో నమోదు చేయాలని అన్నారు. కోవిడ్ పాజిటివ్ వ్యక్తులతో పాటు వారితో ప్రైమరి కాంటాక్టు అయిన వారికి, డ్రైవర్లు, కిరాణషాపులలో వుండేవారు, వీది వ్యాపారులకు కరోనా నిర్దారణ పరీక్షలను నిర్వహించాలని సూచించారు. పాజిటివ్ గా నిర్దారణ అయిన వారికి హోంఐసోలేషన్ లో వుండే వారికి అవసరమయిన మందులను, మెడికల్ కిట్ ను అందించాలని సూచించారు. మండలంలో పాజిటివ్ వారికి ప్రైమరి కాంటాక్టు అయిన వారిని గుర్తించడంలో తహసీల్దార్లు, డాక్టర్లకు సహయ పడతారని తెలిపారు. కరోనా ఎక్కువగా వుండే ప్రదేశాలను గుర్తించి ఉదయం ఆసుపత్రిలో నిర్దారణ పరీక్షలు నిర్వహించి మద్యాహ్నం తరువాత వారి దగ్గరికి వెల్లి పరీక్షలు నిర్వహించాలని సూచించారు. ప్రజలు పరీక్షలన నిమిత్తం ఆసుపత్రులకు వచ్చే విధంగా ప్రజాప్రతినిధుల ప్రజలకు అవగాహన కలిగిస్తారని తెలిపారు. సిబ్బంది పరీక్షలకు ఉపయోగించే మెడికల్ కిట్ లను, పిపిఈ కిట్ మరియు హోం ఐసోలేషన్ కిట్ లను అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు. కిట్లు అవసరమైతే అధికారుల దృష్టకి తీసుకురావాలని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here