తాజా కబురు కోరుట్ల: రిపోర్టర్ -పిట్టల రాజ్ కుమార్
పట్టణం లోని సి నారాయణ భవన్ ప్రాంగణంలో కోటపాటి నరసింహం నాయుడు పుట్టిన రోజు సంధర్బంగా గురువారం మెగా రక్త దాన శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు ఇంచార్జ్ భాష సుధాకర్, ప్రతిమ ఫౌండేషన్ ఆర్గనైజర్ రుద్ర రాం ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రక్త దానం వల్ల ఒక ప్రాణాన్ని కాపాడమనే సంతృప్తి ఉంటుందని అన్నారు. యువజన సంఘాల,మహిళ సంఘాల సభ్యులు, అధికారులు, అన్ని పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు రక్త దానంలో పాల్గొని విజయవంతం చేయాలనీ కోరారు. రక్త దానం చేయాలనుకునే వారు కోరుట్ల లోని నారాయణ భవన్, ఆపోజిట్ తెలంగాణ తల్లి విగ్రహం షికారి పెట్రోల్ బంకు వద్దకు స్వచ్ఛందంగా ముందుకు రావాలని వివరాలకు 7075346576, 9700823465,9949810603 సంప్రదించాలని కోరారు.