కోరుట్ల లో ధరణి వెబ్సైట్ పై అవగాహన

0
75

కోరుట్ల తాజా కబురు: మున్సిపాలిటీ సమావేశ మందిరంలో మున్సిపల్ సిబ్బంది,మెప్మా ఆర్పిలకు ధరణి వెబ్సైట్ పై సోమవారం అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్చార్జి కమిషనర్ గణేష్ రెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్,టి.యస్,హైద్రాబాద్ ఆదేశాల మేరకు కోరుట్ల పట్టణములో అర్భన్ ( ధరణి ) పోర్టల్ నందు 48 కాలమ్ నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీ వివరాలను సేకరించి ధరణి వెబ్ సైట్ నందు నమోదు చేయుటకు 33 వార్డు లకు గాను 33 వార్డు ఆఫీసర్లను నియమించడం జరిగినదని,ధరణి వెబ్ సైట్ కొరకు వార్డు ఆఫీసర్లు మేప్మా ఆర్పి లు సహాయంతో, 48 కాలము నందు ప్రాపర్టీ వివరాలు, నమోదు చేయాలని సూచించారు. కావున పట్టణ ప్రజలు ధరణి వెబ్సైట్ నందు సర్వే చేయుటకు గాను మున్సిపల్ సిబ్బంది అందరికీ ప్రజలందరూ సహకరించి విజయవంతం చేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో మేనేజర్ తన్నీరు రమేష్, ఇంజనీర్ సాయి ప్రణీత్, టీపీఎస్ రమ్య, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ స్వర్ణలత, సీనియర్ అసిస్టెంట్లు రాజశేఖర్, శ్రీధర్, టీఎంసీ జలంధర్, మెప్నా ఆర్పి లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here