కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రి ముందు ఘోరం,కరోనా పరీక్షకోసం వచ్చి కిందపడి మహిళ మృతి

0
185
తాజ కబురు క్రైం జగిత్యాల:జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ అసుపత్రి వద్ద కరోనా పరీక్షలు చేయించుకుంటానని వచ్చిన ఓ మహిళ శుక్రవారం ఆసుపత్రి ముందు కాలుజారి కిందపడి మృతి చెందింది.ఓ పక్క కరోనా విజృంబిస్తున్న సమయంలో లక్షణాలు కనిపిస్తుండంటంతో ఆందోళన చెందుతున్న ప్రజలు ఆ భయం కారణంగా జంకుతున్నారు,ఈ క్రమంలో చాలామంది మానసీకంగా ఇబ్బందులు పడుతున్నారు,ఓ పక్క ప్రభుత్వం పాజిటివ్ కేసు నమెదు అయినా ఇంట్లో ఉండి సరైన చికిత్స తీసుకుంటె ఎలాంటి ప్రమాదం లేదని చెప్పినా ప్రజలు మాత్రం భయాందోళన చెందుతున్నారు. ఇదే క్రమంలో పరీక్షలు చేయించుకునెందుకు వచ్చిన మహిళ ఇలా ఆసుపత్రి ముందె పడి మృతి చెందటం పలువురిని కంటతడిపెట్టించింది.అయితే మహిళకు పరీక్ష నిర్వహించగా పాజిటివ్ అని తేలిందని వైద్యాధికారులు తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here