కోరుట్ల తాజా కబురు:లాక్ డౌన్ వల్ల ఆకలితో అలమటిస్తున్న పట్టణంలోని పలు ప్రాంతాల్లో నివసిస్తున్న వలస కార్మికులకు స్థానిక ప్రభుత్వ ఆమోదిత ప్రైవేటు పాఠశాలల యాజమాన్య సంఘం ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులను సోమవారం పంపిణీ చేశారు. ఈ మేరకు మద్దుల చెరువు, కల్లూరు రోడ్డు, అంబేద్కర్ నగర్, కెసిఆర్ కాలనీ, కోనరావుపేట రోడ్డులో నివసిస్తున్న వలస కార్మికులకు సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మలపల్లి, సత్యనారాయణఅధ్యక్షులు ఎం.ఏ. గఫార్, బండి మహాదేవ్, కార్యదర్శి చౌకి రమేష్, కోశాధికారి తంగళ్ళపల్లి దీపక్, సభ్యులు అల్లే సంఘయ్య, పిన్నంశెట్టి శ్రీధర్, ఎక్కలదేవి దామోదర్, కుడేలు రాజేంద్రప్రసాద్, పడాల నాగభూషణం, మచ్చ వెంకటరమణ, అల్లే సతీష్, టి.వి. సిద్దార్థ, జాప నరేష్ తదితరులు పాల్గొన్నారు.