కోరలు చాచిన కరోనా కోరలు తీసె కృష్ణపట్నం కరోనా మందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్…

0
104

కోరలు చాచిన కరోనా కోరలు తీసె కృష్ణపట్నం కరోనా మందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్…

తాజాకబురు నెల్లూరు: నెల్లూరు కృష్ణపట్నంలో కరోనా ఆయుర్వేద మందుపై జిల్లా అధికారులు పాజిటివ్ నివేదిక సమర్పించారుఈ నేపథ్యంలో కృష్ణపట్నం ఆయుర్వేదానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది
రేపటి నుండి మందు అందుబాటులోకి వచ్చే అవకాశం. నిబంధనలు పాటిస్తూ ఇవ్వాలని ఆదేశం..

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండలం, కృష్ణపట్నం కరోనా మందు పంపిణీపై స్పష్టతనిచ్చిన వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి కృష్ణపట్నంలో బొణిగి ఆనందయ్య కరోనా వ్యాధిని నియంత్రించడానికి, కరోనా సోకిన వారికి నయం చేయడానికి అందజేస్తున్న మందును, రేపటి నుండి (21-05-2021, శుక్రవారం) నుండి పంపిణీ చేస్తున్నాం.

ప్రకృతిపరంగా దొరికే సహజసిద్ధమైన వస్తువులతో, ఆనందయ్య తయారు చేసే ఆయుర్వేద మందు పట్ల ఎటువంటి హానీ ఉండదు.

కృష్ణపట్నంలో అందజేస్తున్న మందు వల్ల అనేకమంది కరోనా బారి నుండి బయటపడి, వారి ఆరోగ్యం కుదుటపడింది.

ఆనందయ్య అందిస్తున్న మందు పట్ల ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారు.

కరోనా ఉదృతిని దృష్టిలో ఉంచుకొని ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పించడానికి, తిరిగి ఆయుర్వేద మందును పంపిణీ చేయాలని నిర్ణయించాం.

రేపటి నుండి అనగా తేది:21-05- 2021, శుక్రవారం ఉదయం నుండి కరోనా సోకిన వారికి వేరుగా, కరోనా రాకుండా నియంత్రించడానికి వేరుగా భౌతిక దూరం పాటిస్తూ, మందు పంపిణీ చేపడుతున్నాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here