కొత్తగూడెం జిల్లాలో కలకలంముగ్గురు యువతుల అదృశ్యం..

0
63

తాజా కబురు భద్రాద్రి కొత్తగూడెం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒకేరోజు ముగ్గురు గొత్తికోయ యువతులు అదృశ్యం కావడం కలకలం రేపుతోంది.కనిపించకుండా పోయిన ఓ యువతి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు.పోలీసుల కథనం ప్రకారం…అశ్వరావుపేట మండలం చెన్నాపురం కాలానికి చెందిన ముగ్గురు యువతులు ఈ నెల 16వ తేదీ నుంచి కనిపించకుండా పోయారు.అయితే వారిని ఛత్తీస్ గడ్ కు చెందిన పంజా దేవా అనే వ్యక్తి 17వ తేదీన తీసుకెళ్లినట్టు ఓ యువతి తండ్రి హేమ్లా ఆదివారం రాత్రి పోలీసులకు లిఖిత పూర్వకంగా పిర్యాదు చేశాడు.ఆ ముగ్గురు యువతులు 16వ,తేదీన గాండ్లగూడెంలోని ఓ వ్యక్తి ఇంటికి వెళ్లారని,ఆ మరుసటి రోజు దేవా వారిని తనతో తీసుకెళ్లినట్టు ఆ ఇంటి యజమాని తెలిపినట్టు హేమ్లా తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. కాగా,కనిపించకుండా పోయిన ముగ్గురు యువతులు కూడా ఒకే గ్రామానికి చెందినవారు కావడం అందులో ఒకరు మైనర్ కూడా కావడం స్థానికంగా కలకలం రేపుతోంది.ఇక యువతులను తీసుకెళ్లిన వ్యక్తి ఎవరు,అతడు ముగ్గురు యువతులను ఎందుకు తీసుకెళ్లాడు,వీరికి మావోయిస్టులతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here