కొండనాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిందట…కరోనా అనుకుంటే కష్టాలు ఎదురయ్యాయి…

0
228

తాజా కబురు ఎడిటర్ ఛాయిస్ డెస్క్ :నాగిరెడ్డి రఘుపతి రెడ్డి

కరోనా మాహామ్మారి మనుషుల మద్య దూరం పెంచింది,అలాగే మనుషుల ఆలోచనలు కూడా మార్చింది,కరోనా భయం గుప్పిట్లో కొంతమంది నిత్యం కరోనా విషయాలను తెలుసుకొని తీవ్ర మానసిక వేదన అనుభవిస్తుంటె మరికొందరు కనీసం సామాజికి దూరం కూడా పాటించకుండా “లైట్” గా తీసుకుంటున్నారు.కరోనా ఇప్పుడు కొందరికి రాక్షాసిలా, దయ్యంలా,పిశాచిలా,ఒక్కొక్కరికి ఒకలా కనిపిస్తుంది, కరోనా కాలంలో మనుషులు కొన్ని నేర్చుకున్నారు,అలాగె కొన్ని పోగొట్టుకున్నారు,విలువైన సమయం వృదా అవుతుంది అని కొందరు బాధపడుతుంటే, బతుకుంటె బలపాలపైనా అమ్ముకొని బతకొచ్చు అని కొందరనుకుంటున్నారు,ఎవరి‌భావాలు ఎలా ఉన్న, కొందరి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

కషాయం తాగాడు…ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు…

అతని పేరు ఏబీసీడీ (పేరు మార్చాం) అతను కరీంనగర్ లో ప్రైవేటు కంపేనిలో పని చేస్తుంటాడు,అంతకముందు ఉదయం డ్యూటీకి వెళ్లటం సాయంత్రం రావటం ఆదివారం పండగ సమయంలో మాత్రమే ఇంట్లో ఉండేవాడు. కానీ మార్చిలో మొదలైన కరోనా కష్టాలు సెప్టెంబర్ ఆరంభమైన వదలటంలేదు, ఆఫీసువాళ్లు ఒకటి రెండు నెలలు పూర్తిగా పనులను వర్క్ ఫ్రం హోం చెయ్యమన్నారు. కానీ మార్కెటింగ్ కాబట్టి కొద్దిలో కొద్దిగైన బయటకు వెళ్లి చెయ్యాల్సి వచ్చేది అందుకే ఏబీసీడీ నిత్యం “భయం” భయంగానే పనికి వెళ్లి వస్తున్నాడు. కానీ అస్తమానం టీవిలో వచ్చే కరోనా అప్డేట్స్, యూట్యూబ్ లో వచ్చే కరోనా వీడియో లు బాగా చూసాడు, ఇక రోజు ఉదయం సాయంత్రం రెండు పూటలంటు ఇంట్లో ఉన్నవాళ్లతో పాటు ఆయన కషాయం తాగటం‌ ఆరంభించాడు. నెలన్నర గడిచింది అప్పుడప్పుడు చాతీలో నొప్పి హే…అసిడిటీ అనుకొని దానికి సంభందించిన చిట్కాలు పాటిస్తు కషాయం తాగుతూనే ఉన్నాడు. రెండున్నర నెలలకు అతని ఆరోగ్యం చాలా క్షీణించింది. భరించలేనంత కడుపునొప్పి కరీంనగర్ లో ఓ ప్రైవేటు ఆసుపత్రి కి తీసుకెళ్లారు. వాళ్లు స్కానింగ గట్రా చేసి హైదరాబాదు పొమ్మన్నరు. హైదరాబాదు లోని ఓ కార్పోరేట్ ఆసుపత్రిలో చేర్పించారు.కడుపులో ఉన్న పేగు రోజుకో కషాయాలు తాగటం వల్ల పగిలి పోయిందట, ఎదోలా వైద్యం అందించి పంపించారు.

బిల్లు లక్షరూపాలకు పైనే అయింది. ఇంటికి వచ్చాక నాలగవ రోజు నుండి జ్వరం,జలుబు ఇదేందో అని సదురు ఆస్పత్రి కి ఫోన్ చేస్తె ఎంతకైన మంచిది కరోనా పరీక్ష చేపించుకోమని చెప్పారు. భయానికి లోనైన ఏబీసీడీ కి గుండెపోటు వచ్చింది. వెంటనే మళ్లీ అసుపత్రి కి తరలించారు.ముందుగా కరోనా పరీక్షలు చేశారు రిజల్ట్ నెగెటివ్ వచ్చింది. అసుపత్రి లో ఉన్నప్పుడు వాడినా నీరు ఇంటికి వచ్చాకా వాడిన నీరు మారటంతో జలుబు అయింది అంతే, కానీ భయపడి మళ్లీ అసుపత్రిలో పడ్డాడు ఏదోలా పదిరోజులకు ఇంటికి చేరుకున్న ఏబీసీడీ ఆలోసించసాగాడు అతి జాగ్రత్త అతి భయం కారణంగా డబ్బులు వృధా అయ్యాయి. అలాగె పానం నుక్సాన్ అయింది. అని వాళ్ల మిత్రులతో వాట్సప్ గ్రూపు క్రియెట్ చేసి తన అనుభవాలను పంచుకున్నాడు. కరోనా లక్షణాలు కనిపిస్తే పరీక్ష చేసుకోవాలని, ప్రభుత్వం సూచించిన మందులు పద్దతులు పాటించి ఇంట్లోనె ఉండండి కానీ యూట్యూబుల్లో, షోషల్ మీడియాలో వచ్చిన వీడియోలు చూసి వాటిని వాడకండి ఇప్పటివరకు ఓ అహార అలవాట్లకు బానీసలమైన మనం ఉన్నఫలంగా పూర్వం తీసుకున్న ఆహారం తీసుకుంటే జరిగె పరిణామాల గురించి ఆయన పూర్తిగా వివరించారు. అందుకే సోషల్ మీడియాలో ఇతర సోషల్ నెట్వర్క్లో వచ్చే నిరాధారమైన వార్తలు చూసి కషాయాల పేరుతో కష్టాలను కొనితెచ్చుకోకండి అంటున్నాడు.

తన దైర్యం పదిమంది బలం.
నువ్వు దైర్యంగా ఉంటే నీ పక్కన పదిమంది ఉన్నట్లే,అందుకే …. ఏది వచ్చినా ఆందోళన చెందకుండా ప్రభుత్వ సూచనలు పాటించాలని, అలాగే సామాజిక దూరం పాటించాలని ప్రభుత్వాలు కోరుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here