కేసిఆర్ కు సీయం హోదాలో కొనసాగే హక్కులేదు “గ్రేటర్” దెబ్బతో జ్జానోదయం అయింది: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

0
34
tajakaburu
tajakaburu

కేసిఆర్ కు సీయం హోదాలో కొనసాగే హక్కులేదు “గ్రేటర్” దెబ్బతో జ్జానోదయం అయింది: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

తాజాకబురు, జగిత్యాల, డిసెంబర్ 17: గ్రేటర్ ఎన్నికల్లోఅసలుతెలంగాణ వాదుల విశ్వాసం కోల్పోవడమే కాకుండా సమైక్యవాదుల మద్దతు పొందుతున్న కేసీఆర్ అధికారంలో కొనసాగే నైతికహక్కు లేదని కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం జగిత్యాలలో ఉపాధ్యాయులు చేపట్టిన ధీక్షలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఆంధ్ర ప్రాంత సెటిలర్లు ఉన్నప్రాంతాల్లోనే టిఆర్ఎస్ కార్పొరేటర్లు గెలుపొందారని, తెలంగాణ వాసులున్న చోట్ల టీఆర్ఎస్ ఓటమి చెందిందని దీనికి కారణం సమైక్యవాదులతో కొమ్ముకాయడమేనని ప్రజలు తెలుసుకున్నారని అన్నారు.. అసలు సిసలైన తెలంగాణ వాదుల ఓట్లు టిఆర్ఎస్ కు రాలేదని, వీరి విశ్వాసం కోల్పోయారని అన్నారు.గ్రేటర్ ఎన్నికల్లో మునుపటికంటే సీట్లు ఎందుకు తక్కువ వచ్చాయని, దానికి కారణం అసలు తెలంగాణవాదుల పట్ల కేసీఆర్ అనుసరిస్తున్న విధానాలేనని పేర్కొన్నారు. ఎంఐఎం చీఫ్ అసదొద్దీన్ తెలంగాణ ను వ్యతిరేకించిన సమైక్యవాదికదా అని ప్రశ్నించారు. గ్రేటర్లో అధికారంకోసం ఎంఐఎం తో వంతపాడటం నిజంకాదని జీవన్ రెడ్డి కేసీఆర్ ను సూటిగా ప్రశ్నించారు. తెలంగాణకోసం పోరాడిన వ్యక్తులపై కేసీఆర్ కక్ష్య కట్టారని తెలిపారు. గ్రేటర్ దెబ్బతో ముఖ్యమంత్రి కేసీఆర్ కు జ్గ్యానోదయమై 50వేల ఉద్యోగ ఖాళీల భర్తీకి సిద్ధమయ్యాడని, ఇప్పటికైనా కేసీఆర్ అనాలోచిత విధానాలకు స్వస్తిపలుకలని హితవుపలికారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here