కేజియఫ్ సినిమా కోసం కాదు ఆ సాంగ్ కంపోజ్ చేసింది

0
497

 

కేజియఫ్ సినిమా కోసం కాదు ఆ సాంగ్ కంపోజ్ చేసింది

తాజ కబురు  (సినిమా ప్రతినిధి ) శ్రీ గద్దె రత్నాకర్

కేజియప్ హీరో రాక్ స్టార్ యశ్ నటించిన ‘కేజీఎఫ్'(కోలార్ గోల్డ్ ఫీల్డ్స్) దేశవ్యాప్తంగా ఏ స్థాయిలో ప్రకంపనలు సృష్టించిందో తెలిసిందే. కన్నడతో పాటు తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో ఈ చిత్రం ఏ రేంజ్‌లో కలెక్షన్లు వసూలు చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్‌గా కేజీఎఫ్‌-2ను తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ అప్‌డేట్‌ సోషల్‌ మీడియాలో తెగ ట్రెండ్‌ అవుతోంది.

కేజీఎఫ్‌ మూవీలో ‘ధీర ధీర’అంటూ సాగే యాక్షన్‌ సాంగ్‌ ఆ సినిమాకు ఎంత హైలెట్‌గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కాలర్‌ ట్యూన్‌, రింగ్‌ టోన్‌ అంటూ ఎక్కడ చూసినా..విన్నా ఈ సాంగే కనిపించేది, వినిపించేది. అంతేకాకుండా సినిమాను నిలబెట్టడంలో ఈ పాట కీ రోల్‌ పోషించిందని సినీ విశ్లేషకులు పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే ధీర ధీర సాంగ్‌ను కంపోజ్‌ చేసింది కేజీఎఫ్‌ కోసం కాదని ఆ చిత్ర సంగీత దర్శకుడు రవి బస్రూర్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

‘ధీర ధీర సాంగ్‌ ఎంత పాపులర్‌ అయిందో అందరికీ తెలుసు. అయితే ఆ సాంగ్‌ను కేజీఎఫ్‌ ఫస్ట్‌ పార్ట్‌ కోసం కంపోజ్‌ చేసింది కాదు. సెకండ్‌ చాప్టర్‌ కోసం ఈ పాటను సిద్దం చేసి పెట్టాం. అయితే కేజీఎఫ్‌లో యశ్‌ సుత్తి పట్టుకొని చేసే యాక్షన్‌ సీన్‌కు ఈ పాట సూట్‌ అవుతుందని భావించి ఈ సాంగ్‌ను పెట్టాం. అయితే పూర్తి సాంగ్‌ కాదు. కేజీఎఫ్‌-2లో పూర్తి సాంగ్‌ను వినబోతున్నారు. అయితే కేజీఎఫ్‌లో మీరు విన్న ధీర ధీర సాంగ్‌కు మించి చాప్టర్‌ 2లో ఉండబోతోంది’అంటూ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. ధీర ధీరతో పాటు సలామ్‌ రాకీభాయ్‌ వంటి సేన్సేషన్‌ సాంగ్స్‌ను రవి కంపోజ్‌ చేసిన విషయం తెలిసిందే.

ఇక ఈ చిత్రంలో యశ్‌ సరసన శ్రీనిధి శెట్టి కనిపించనుంది. అంతేకాకుండా బాలీవుడ్‌ విలక్షణ నటుడు సంజయ్‌ దత్‌ ఈ సినిమాలో విలన్‌గా కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన సంజయ్‌ దత్‌ లుక్‌ అందరినీ తెగ ఆకట్టుకుంటోంది. ప్రశాంత్‌ నీల్‌ దర్వకత్వం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్‌లో రిలీజ్‌ కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here