కాషాయ జెండాలు పెట్టడానికి వెనుకాడొద్దు – భా.జ.పా జిల్లా అధికార ప్రతినిధి

0
267

జగిత్యాల టౌన్ తాజాకబురు : ఇటీవల‌ కాలంలో కొన్ని ప్రాంతాలలో కూరగాయలు, పండ్లు విక్రయించే తోపుడు బళ్ళపై, వాహనాలపై ఏర్పాటు చేసిన కాషాయ జెండాలు పోలీసులు తీసివేయించిన విషయం వెలుగులోకి వచ్చినాయని జిల్లా భాజపా అధికార ప్రతినిధి, కేంద్ర న్యాయవాది చిలుకమర్రి మదన్ మోహన్ అన్నారు . ఈ సందర్బంగా అయన తాజా కబురుతో మాట్లాడుతూ హిందూ ధర్మానికి సంబంధించిన కాషాయ జెండాలు గాని, దేవీ దేవతల‌ చిత్రపటాలు గానీ ఏర్పాటు చేసుకునే మతస్వేచ్ఛ ప్రతి పౌరునికి ఉందని,మత చిహ్నాలను వ్యక్తిగత ప్రదేశాల నుండి బలవంతంగా తీసివేయడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు.

రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 25 నుంచి 28 వరకు పరిశీలించినట్లయితే ప్రతి పౌరునికి మత స్వేచ్ఛ కల్పించడం జరిగిందని, గత ఏడాది ముంబై హై కోర్టు కాషాయ జెండాలు ఎగుర వేయడం కానీ, నినాదాలు చేయడం కానీ నేరం కావని తీర్పు చెప్పిన విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని అన్నారు.

కూరగాయల‌ దుకాణాలు, పండ్ల దుకాణాలు, ఇతర వ్యాపార సముదాయాల్లో కాషాయ జెండాలు ఎగురవేయడం కానీ, వ్యక్తిగతంగా కాషాయ వస్త్రాలు ధరించడం గానీ నేరం కాదని,ఈ నేపథ్యంలో పోలీసుల‌ నుంచి ఇతర వ్యక్తుల‌ నుండి సమస్యలు కానీ బెదిరింపులు కానీ ఎదురైతే, జెండాలు తీసివేయాల‌ని ఎవరైనా ఒత్తిడి తెస్తే వెంటనే న్యాయ సహాయం లేదా సలహా కోసం ఆయన్ను సెల్ ఫోన్‌ నం. 9440492743 లో సంప్రదించాలని ఒక ప్రకటనలో తెలిపారు.

ఇదే సమయంలో మత సామరస్యాన్ని కాపాడడం కూడా మన బాధ్యత, ఎవరి స్థలంలో నైనా బలవంతంగా జెండాలు ఉంచడం కానీ, మరెవరివైనా తీసివేయడం కూడా తప్పు అని గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here