కాంగ్రెస్ నాయకుడిపై హత్యయత్నం

0
74

అర్థరాత్రి ఇంటిలోకి ప్రవేశించి సిలిండర్ తో తలుపులు పగలగొట్టి,ఇంట్లోకి చొరబడి కత్తితో దాడి.

అప్రమత్తమైన నాయకుడు,ఎదురుదాడి,గుర్తు తెలియని వ్యక్తిని పట్టుకొని పోలిసులకు సమాచారం..

కోరుట్ల తాజా కబురు: పట్టణానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు తిరుమల గంగాధర్ పై గుర్తు తెలియని వ్యక్తులు నిన్న అర్థరాత్రి హత్యయత్నం చేశారు,ఇంట్లో నిద్రిస్తున్న క్రమంలో వచ్చిన అగంతకులు ఇంట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు,తలుపులు తెరవకపోవటంతో సిలిండర్ తో డోర్ ను బద్దలు కొట్టారు అప్పటికె అప్రమత్తమైన గంగాధర్ వచ్చిన అగంతకులను ఎదుర్కోన్నాడు,గంగాధర్ మెడపై కత్తిపెట్టి దాడి చేసె క్రమంలో తోపులాట జరిగింది,అప్పటికె పై దాడి చేసిన వ్యక్తులను గంగాధర్ కూడ ఎదురుదాడికి దిగగా ఒక వ్యక్తి దొరికాడు,ఈ పెనుగులాటలో గుర్తుతెలియని వ్యక్తికి గాయాలయ్యాయి, పోలిసులకు సమాచారం అందించటంతో అక్కడికి చేరుకున్న పోలిసులు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు, వచ్చింది ఇద్దర,లేకా ఎంతమంది అన్న కోణంలో పోలిసులు విచారణ చేపట్టారు, అయితె కోరుట్ల నియోజకవర్గం లోని మెట్పల్లి మండలం వెంకట్రావుపేట్ గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కొమొరెడ్డి లింగారెడ్డి పై గత నాలుగు రోజుల క్రితం దాడి చేశారు గుర్తుతెలియని వ్యక్తులు అతనిపై విచక్షణారహితంగా దాడి చేయగా తీవ్రంగా గాయపడిన రంగారెడ్డిని ఆస్పత్రికి తరలించారు గడిచిన వారం లో ఒకె నియోజకవర్గం లో ఇద్దరు సీనియర్ కాంగ్రెస్ నేతలపై దాడి జరగడం చర్చనీయాంశంగా మారింది అసలు దాడికి పాల్పడిన వ్యక్తులు ఎవరు ఎందుకోసం దాడికి ప్రయత్నించారు హత్య చేయడానికి వచ్చారా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు
ఇందులో ఏదైన రాజకీయ కోణం ఉందా లేకా, వ్యక్తిగత కక్షలే కారణమా అన్నది తెలియాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here