
తాజా కబురు సిద్దిపేట జిల్లా : గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ ఘోరం, మున్సిపాలిటీలో పనిచేసే 9మంది మున్సిపల్ కార్మికులకు కరోనా పాజిటివ్ రాగా వారిని అధికారులు నిర్లక్ష్యంగా చెత్తను తరలించేందుకు ఉపయోగించే ట్రాక్టర్ లో R.V.M ఆస్పత్రికి తరలింపు చేసిన తీరుపై ఆగ్రహించిన తోటి మున్సిపల్ కార్మికులు ఆదివారం మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు.సంఘటన స్థలానికి చేరుకున్న జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తూముకుంట నర్సారెడ్డి కార్మికుల ఆందోళనకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా కష్ట కాలంలో తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి ప్రజా సేవ చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను చిన్నచూపు చూడడం దారుణమని, దొరల రాజ్యంలో దళితులకు అన్యాయం చేసి, దళితులను చిన్నచూపు చూస్తే తగిన గుణపాఠం చెబుతామని ఈ చర్యకు కారణమైన వారిపై తగిన చర్య తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.