కరోనా మహమ్మారిని కట్టడి చెయ్యాలంటె స్వీయనియంత్రణ పాటించాలి,గ్రామగ్రామాన అవగాహాన కల్పిస్తున్న సీనియర్ జర్నలిస్టు
గ్రామాల్లోకి వెళ్లి అవగాహన కల్పిస్తున్న సీనియర్ పాత్రికేయులు
—-కరపత్రాలను పంచుతూ అవగాహన కల్పిస్తున్న సీనియర్ పాత్రీకేయులు ముంజ ధర్మపురి..
స్వీయనియంత్రణ పాటిస్తె కరోనా ను జయించవచ్చని చెపుతున్న జర్నలిస్ట్..
కరోనా వైరస్ మహమ్మారి రోజురోజుకు విస్తరిస్తూ పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రంతో పాటు రాష్ట్రంలో కూడా పాజిటివ్ కేసులు పెరుగుతున్నటువంటీ విపత్కర పరిస్థితులను చూసి చలించి కరోనా వైరస్ ను ఖతం చేద్దామనే లక్ష్యంతో ప్రజలు వ్యాధి బారిన పడకుండా చైతన్యవంతులను చేయాలనే ఉద్దేశ్యంతో పట్టణానికి చెందిన సీనియర్ పాత్రికేయులు ముంజ ధర్మపురి గౌడ్ వైరస్ నియంత్రణ అంశాలతో ముద్రించిన కరపత్రాలతో మండలంలోని గ్రామాలకు వెళ్లి అవగాహన కల్పిస్తున్నారు. బుధవారం రోజున మండలంలోని వడ్డెర కాలని, ఒడ్డె లింగాపూర్, వస్తాపూర్, తాట్లవాయి, కట్కాపూర్, ధావన్ పెల్లి, కైరిగూడెం, ధర్మాజీపేట, వీరాపూర్ గ్రామాలకు వెళ్లి సర్పంచులు,ఎంపిటిసి ల ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి కరపత్రాలను అందిస్తూ అవగాహన కల్పిస్తున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్ డౌన్ ను గౌరవిద్దాం… భౌతిక దూరం పాటిద్దామంటూ కరోనా వైరస్ తుమ్మినా, దగ్గినా ఇతరులతో మాట్లాడినప్పుడు తుంపర్ల ద్వారా వ్యాధి వ్యాపిస్తుందన్నారు. ఫేస్ మాస్కులు ధరించడం వల్ల ఇతరులకు సోకకుండా ఇతరుల నుండి మనకు సంక్రమించకుండా ఫేస్ మాస్కులు ఎంతో రక్షణగా ఉంటుందన్నారు. ఒకసారి వినియోగించిన మాస్క్ లను ఉప్పు కలిపిన వేడినీటిలో సబ్బుతో ఉతికి శుభ్రం చేసిన తర్వాత 5 గంటలు ఎండలో ఆరబెట్టి వాడాలన్నారు. రివర్స్ చేసి మాస్కులు ధరిస్తే వైరస్ సంక్రమించే ప్రమాదం ఎక్కువగా ఉంటుందన్నారు. అత్యవసర పని మీద బయటకు వెళ్ళినప్పుడు ఫేస్ మాస్కులు తప్పకుండా వాడాలన్నారు. గుమిగూడి ఉండకుండా ఒంటరిగా స్వీయ నియంత్రణలో ఉండటమే శ్రేయస్కరమన్నారు. కరోనా వైరస్ మహమ్మారి మనదేశంలో పుట్టిన వ్యాధి కాదని నివారణ ఒక్కటే మార్గమని సూచించారు.అత్యవసర పనుల మీద బయటకు వెళ్ళి ఇంటికి వచ్చిన ప్రతిసారి కాళ్లు,చేతులను సబ్బుతో గాని శానిటైజర్ తో పరిశుభ్రంగా కడుక్కోవాలని సూచించారు. దాతలు ముందుకు వస్తే జీపు, కారుపై మైక్ సెట్ ద్వారా ప్రచారం చేస్తూ ప్రజలకు అవగాహన చేయడానికి సిద్ధంగా ఉన్నాని తెలిపారు. కరోనా వైరస్ నివారణ చర్యల గురించి ఆయన చేస్తున్న గొప్ప ప్రయత్నాన్ని చూసి పలువురు అభినందించి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఆయన వెంట తోటి పాత్రికేయులు అనుపురం లింబాద్రి గౌడ్,కనికరపు లక్ష్మణ్,కడకుంట్ల జగదీశ్వర్, చింతకుంట సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.