కరోనా ’భయం’ కనిపించటం లేదు,కనిపించె శత్రువుపై పోరాటం చెయ్యచ్చు కానీ కనిపించని దానితో…
తాజకబురు స్పెషల్ కరస్పాండెంట్ : సరిగ్గా మూడు నెలల క్రితం అందరు ఉల్లాసంగా ఉత్సహాంగా ఎలాంటి బాధరబంధీ లేకుండా స్వేచ్చగా బతికారు, కానీ ఒక్కసారీగా, తుఫాన్ లా, సునామీలా, మరింత భయంకరంగా వచ్చింది కరోనా,ఆ వ్యాధి బారీన పడినవాళ్లు అమెరికా, రష్యా,ఇటలీ, చైనా దేశాల్లో పిట్టల్ల రాలిపోవటంతో భారతదేశంలో ఉన్న, చూస్తున్న సగటు మనిషి నుండి మేదావుల వరకు భయం గుప్పిట్లో నిద్రలు లేని రాత్రులు గడిపారు, కేంద్రం, రాష్ర్టం లాక్ డౌన్ విధించి స్వీయనియంత్రణ పాటించటం తప్ప మరో మార్గం లేదని కరఖండిగా చెప్పింది, అలా మొదలైన కరోనా భయం పాజిటివ్ కేసు ఒక్కటి వచ్చిన అల్లకల్లోలం చేసేలా అటు ప్రభుత్వం, ఇటు మీడియా,ప్రచారం చేశాయి, రెండు నెలల పాటు ఇళ్లల్లోని ఉంటు పాతపద్దతులకు సానపెడుతూ జనాలు తమ ప్రాణాలను కాపాడుకోవటానికి ఎంతో ప్రయత్నం చేశారు, ఇప్పటికి చేస్తున్నారు కానీ……
కరోనా సాధరణ జబ్బులాగె మారనుందా….
ఇంత చేసి లక్షల వలసకార్మికులకు అన్నదానాలు, నిరుపేదలకు నిత్యవసర సరుకులు , ఇలా ఎవరికి తోచిన సాయం వాళ్లు చేసి రెండు నెలలపాటు ఎంతో నిష్టగా దీక్షాలాగా పాటించిన జనాలు ఎందుకు ఇప్పడు దానిగురించి పట్టించుకోవటం లేదు, ప్రభుత్వం సడలింపు ఇచ్చిందనా…లేకా కరోనాతో ఏం కాదనా…
లాక్డౌన్ సడలింపు స్వేచ్చ వచ్చిందని యదెచ్చగా తిరుగుతున్న జనాలు..
సాధరణంగా రెండు నెలల పాటు ప్రజలు బయటకు రాకుండా ఉండటం మాములు విషయం కాదు, అది అలాగె కొనసాగితె దేశ ఆర్థిక వ్యవస్థ తెబ్బతింటుందనె ఆలోచనతో అటు కేంద్రం, ఇటు రాష్ర్టాలు సడలింపులు ఇచ్చాయి, కానీ ఆ సడలింపులను ప్రజలు ఎత్తివేశారు అన్న చందంగా వ్యవహరిస్తున్నారు,
ముందు అతి జాగ్రత్త, మరి ఇప్పుడు లేదు బెంగ..
సడలింపు వరకు బయటకు వెళ్లాలన్న, పక్కవారితో మాట్లాడలన్న భయపడిపోయిన జనాలు ఇప్పుడ అవేవి జరగనట్టు, తమకు ఏం జరగబోదు అన్నట్టు వ్యవహరించటం ఆశ్చర్యకరం, ప్రభుత్వం చెపితేనె నియంత్రణ పాటిస్తారా, తమకు తాము స్వీయ నియంత్రణలో ఉండలేరా అనె అనుమానం వస్తుంది.
వైద్యులు, పోలిసులు, పారిశుద్యకార్మికులు, జర్నలిస్టు సేవలకు వీరిచ్చె విలువ ఏంటి ?
కరోనా కోసం పోరాడుతున్న వైద్యులు, పోలిసులు, పారిశుద్యకార్మికులు, జర్నలిస్టు గురించి సోషల్ మీడియాలో రెండు నెలల పాటు ఉదరగొట్టిన ఈ జనాలు ఇప్పుడు సడలింపుతో వారి చేసిన సేవను , వారు చేసిన క్రుషిని మరచి మళ్లీ మేం మాములు మనుషులమె అని నిరూపించారు. అనవసరమైన ప్రయాణాలు, అవసరంలేని శుభకార్యాలు, మాములు రోజుల్లా జీవనవిధానం ఉన్నట్టు మళ్లీ జనాలు అలాగె నడుచుకుంటున్నారు..
బస్సులు ప్రారంభం అయ్యాయి ఇకా ఎవరిని ఆపతరమూ..
సుమారు రెండు నెలల పాటు లాక్డౌన్ తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసి బస్సులను నడిపెందుకు నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయంతో ప్రతి ఒక్కరికి స్వసంత్ర్యం వచ్చినట్టె బావిస్తున్నారు కానీ స్వీయ నియంత్రణ పాటిస్తారా లేదా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న..