కరోనా “భయంలో” ఆరంభమైన “బతుకమ్మ” ఆటలు

0
327

తాజా కబురు డెస్క్ వినోదం:- జర్నలిస్ట్ మోత్కూరి శ్రీనివాస్.

బతకమ్మ బతకమ్మ మా తల్లీ బతకమ్మ బతకమ్మ బతకమ్మ మా తల్లీ బతకమ్మ…బతకమ్మ బతకమ్మ ఉయ్యాలో బంగారు బతకమ్మ ఉయ్యాలో…. అంటు సంవత్సరంలో ఒక్కసారి నిర్వహించుకునె బతకమ్మ పండగలు ఎంతో విశిష్టత ఉంది,మహిళలు తమ కష్టాలను,బాధలను,నష్టాలను,సంవత్సరకాలంలో పడిన శ్రమను మర్చిపోయి ఈ బతకమ్మ రాత్రుల్లో ఎంతో ఉత్సాహంగా గడుపుతారు,పట్టణాల్లో పల్లెల్లో ఎక్కడ చూసిన బతకమ్మ కోలాహలం మనకు కనువిందు చేస్తుంది మహిళలు ఆడుతున్న ఆటలు ఎంతో ఆనందాన్ని కల్పిస్తుంది,కోలాలతో,చప్పట్లతో పాటలు పాడుతూ బతకమ్మ ఆట ఆడుతారు మహిళలు, అనాదిగా వస్తున్న బతుకమ్మ ఆటలు కరోనా మహమ్మారి వల్ల ఈసారి కాస్త దూరమయ్యే పరిస్థితి కనిపిస్తుంది,సమాజిక దూరం పాటిస్తూ, మాస్క్ లు ధరిస్తూ బతకమ్మను ఆడుకోవచ్చు కానీ సహాజసిద్దంగా మాత్రం ఉండదు,ఇప్పుడు జగిత్యాల జిల్లా కేంద్రంలో బతకమ్మ ఆటలు ప్రారంభమయ్యాయి, విధుల్లో మహిళలు బతకమ్మను పేర్చి ఆటలు ఆడుతున్నారు,ఈ కరోనా సమయంలో బతకమ్మ ఆటను మహిళలు ఎంతవరకు ఆస్వాదిస్తారో చూడాలి మరీ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here