కరోనా భయంతో పాముకు మాస్క్ కట్టాడు

0
364

వింత అవగాహాన కల్పిస్తున్న పాముల గంగారాం…

తాజా కబురు కోరుట్ల:కరోనా మాహామ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తుంది,మనుషుల మనుషుల మద్య ఎంత సంభందాలు కొనసాగేవో అంత దూరంగా మారిపోయాయి,కరోనా పట్ల ప్రభుత్వాలు ఎన్ని సూచనలు చేస్తున్న చాలామందిలో మార్పు కనిపించటం లేదు,సామాజిక దూరం, మాస్క్ ధరించటం వంటివి గాలికొదిలేశారు, అలాంటి వాళ్లకోసమె ఓ వ్యక్తి మంచి సందేశం ఇస్తున్నాడు.

జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామానికి చెందిన పాముల గంగారాం వృత్తిరిత్యా తాతాముత్తాలనుండి వస్తున్న పాములను పట్టడం వాటిని ఆడిస్తు పొట్టపోసుకుంటాడు,వాటిపై వచ్చె ఆదాయంతోనె పూట గడుస్తుంది, దాంతోపాటు బయటకు వెళ్లలేని వికలాంగురాలైన కూతురు ఉంది, ఆరునెలలనుండి బయటకు వెళ్లి పాము ఆటలు ఆడించె పరిస్థితి లేకపోవటం వల్ల గంగారాం పూట గడవటమె కష్టంగా మారింది, కూళీ పనికి వెళుతు కుటుంబాన్ని పోసించుకుంటునే సమాజానికి ఓ సందేశం ఇస్తున్నాడు,తనవద్ద ఉన్న నాగుపాముకు మాస్క్ కట్టి అక్కడక్కడ ఉచితంగా ఆడిస్తున్నాడు,అలాగె చూసెవాళ్లకు పాముకు మాస్క్ పెట్టిన అయినా ఆ పాముకు మాస్క్ ఆగదు అయిన పెడుతున్నా, కరోనా ఆ పాముని ఏం చెయ్యదు కానీ మాస్క్ పెడుతున్నా ఎందుకో తెలుసా విషసర్పానికె మాస్క్ పెడితె మేం కూడా పెట్టుకోవాలని మీరు పెట్టుకుంటారని ఇలా చేస్తున్నా, దయచేసి అందరు మాస్క్ ధరించండి అంటు అవగాహాన కల్పిస్తున్నాడు..‌‌తనకు ఉపాధినిచ్చె పామువల్ల ప్రస్తుతానికి పొట్టనిండకపోయినా సమాజానికి అతను చూపిస్తున్న అవగాహాన పలువురిని ఆకర్శిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here