కరోనా పై భయం వద్దు- శాసన సభ్యులు డా.సంజయ్ కుమార్

0
74

రాయికల్ తాజా కబురు:మండలంలోని ఒడ్డెర కాలనీ(శివాజీ నగర్) గ్రామంలో ఇటీవల కరోనా నిర్దారణ పరీక్షలు చేయగా 40 మందికి పైగా పాజిటివ్ రాగా శుక్రవారం గ్రామంలో శాసన సభ్యులు డా.సంజయ్ కుమార్ కరోనాపై వ్యాధి వ్యాప్తి,తీసుకోవాల్సిన జాగ్రత్తలు,కరోనా లక్షణాలు తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించిన అనంతరం గ్రామస్తులకు సర్పంచ్, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో 500 మాస్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లు మన్నెగుండ్ల వెంకమ్మనర్సయ్య, బత్తిని రాజేశం, యం.పి.టి.సి మందుల శ్రీనివాస్,ఉప సర్పంచ్ రాజేష్, సింగిల్వివిండో చైర్మన్ మల్లారెడ్డి ,వైస్ యంపిపి మహేశ్వర్ రావు, తెరాస మండల అధ్యక్షుడు కోల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి తలారి రాజేష్,నాయకులు లావుడ్యా సురెంధర్ నాయక్,శ్రీనివాస్ గౌడ్,గంగారెడ్డి,రమేష్,తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here