కరోనా పై ప్రభుత్వ నిర్లక్ష్యం తగదు

0
235

జగిత్యాల తాజా కబురు: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ను అరికట్టుటలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలంగాణ జనసమితి జగిత్యాల జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి ఆరోపించారు. గురువారం జనసమితి పార్టీ తరఫున కరోనా పై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా పలు డిమాండ్లతో కూడిన జిల్లా ఒక విజ్ఞాపణ పత్రం కలెక్టర్ కార్యాలయంలో అందజేశారు. రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబానికి రేషన్ కార్డుతో సంబంధం లేకుండా నెలకు ఉచితంగా రేషన్ మరియు రూ.7500/ లు నగదు చొప్పున రెండు నెలలు ఇవ్వాలన్నారు.

ప్రజా ఆరోగ్యాన్ని అత్యంత ప్రాధాన్యత గా గుర్తించి వెంటనే కరోనా టెస్టుల సంఖ్య పెంచాలని కోరారు.
రాష్ట్ర వ్యాప్తంగా అత్యవసర వైద్య సౌకర్యాలు కల్పించి కరోనా ను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తేవాలని డిమాండ్ చేశారు. కులవృత్తులకు, వృత్తి కార్మికులకు ప్రత్యేక ప్యాకేజి ఇవ్వాలన్నారు. చిరు వ్యాపారులను, చిరు ఉద్యోగులను ఆదుకోవటానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపాలని డిమాండ్ చేశారు.సిఏం .రిలీఫ్ పండ్ పైన శ్వేతపత్రం విడుదల చేయాలని, కేంద్రం ఇచ్చిన నిధులపై వివరాలను ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జనసమితి జగిత్యాల జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి, ఉపాధ్యక్షులు అళ్ళెంకి శ్రీనివాస్, కోశాధికారి గడప చంద్రశేఖర్ రావు, నాయకులు సుందర్ రెడ్డి విజయ్ కుమార్, తునికి ప్రవీణ్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here