కట్కాపూర్ లో 85, కోండ్రికల్ లో 70 పాజిటివ్ కేసులు-కరోనా విస్తరించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్ జి. రవి

0
457

జగిత్యాల,ఏప్రిల్,12 (తాజా కబురు):: కరోనా పాజిటివ్ కేసులు ప్రతిరోజు పెరిగిపోతున్న తరుణంలో ఒకరినుండి మరొకరికి సంక్రమించకుండా కట్టుదిట్టమైన చర్యలను చేపట్టాలని జిల్లా కలెక్టర్ జి. రవి అన్నారు. సోమవారం రాయికల్ మండలం కట్కాపూర్ గ్రామంలో మెట్పల్లి మండలం కొండ్రికల్ గ్రామాలలో పర్యటించి ఆయా గ్రామాల్లో చేపడుతున్న చర్యలను పరిశీలించారు.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ,రాయికల్ మండలం కట్కాపూర్ గ్రామంలో ఏప్రిల్ 2వ తేది నుండి 11 ఎప్రిల్ వరకు 85 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, కోండ్రికల్ గ్రామంలో 5 ఎప్రిల్ నుండి నేటి వరకు 70 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలియజేశారు.గ్రామంలో పాజిటివ్ గా నిర్దారణ అయిన వారు బయటి ప్రాంతాలలో సంచరించకుండా ఇంట్లోనే ఉండేలా పర్యవేక్షించాలని,పాజిటివ్గా నిర్దారణ అయిన వారు ఎవరితో సంబందం లేకుండా ప్రత్యేకగదిలో ఉండేలా చూడడంతో పాటు,బయాందోళనలకు గురికాకుండా వారికి మందులు అందించి వాటిని ఏవిధంగా వాడాలో తెలియజేయాలని,గ్రామంలో పరిసరాలు పరిశుభ్రంగా ఉండెలా చూడాలని, పాజిటివ్ గా నిర్దారణ అయిన వారికి గ్రామపంచాయితి సిబ్బంది ద్వారా కూరగాయలు వంటి అవసరాలు తీర్చేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
గ్రామాలలో నిర్వహించిన జాతరలలో పాల్గోన్న వారిని గుర్తించి వారు వ్యాది నిర్దారణ పరీక్షలు నిర్వహించుకునేలా చూడాలని, పండుగను పురస్కరించుకొని ఇతర ప్రాంతాల నుండి ప్రజలు వచ్చే అవకాశం ఉన్నందున నిర్దారణ పరిక్షలకు, మందులు, వ్యాక్సిన్ లను ముందుగానే అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని వైద్యాధికారులను అదేశించారు.జిల్లా నుండి గ్రామం వరకు కోవిడ్ నిబంధనలను పాటించని వారిపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు.కొండ్రికల్ గ్రామంలో మాస్కు లేకుండా బైక్ పై వెలుతున్న బద్దం రమణ కు వేయి రూపాయల జరిమాణను విధించాలని పంచాయితి సెక్రటరిని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి శ్రీధర్,ఇతర అధికారులు పాల్గోన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here