కరోనా పరీక్షలను గురించి జడ్పీ చైర్ పర్సన్ సమీక్ష

0
91

తాజా కబురు జగిత్యాల: జిల్లా పరిషత్ కార్యాలయంలో జడ్పీ చైర్ పర్సన్ దావ వసంతసురేష్ శుక్రవారం జిల్లా ప్రధాన ఆసుపత్రి సూపరిండెంట్ తో ఆసుపత్రిలో జరుగుతున్న కరోనా పరీక్షల గురించి, కరోన పేషెంట్లు ఆరోగ్య పరిస్థితి గురించి సమీక్షసమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రధాన ఆసుపత్రి లో గల వైద్యులందరూ జాగ్రత్తలు పాటిస్తూ తప్పనిసరిగా పి.పి.ఇ కిట్ లు ధరించి ఎప్పటికప్పుడు కరోనా పేషెంట్ల ఆరోగ్య పరిస్థితి తెలుసుకుంటూ,మనో ధైర్యాన్ని నింపాలని అన్నారు.మౌలిక సదుపాయాలు, శానిటేషన్,కరోనా టెస్ట్ కిట్ల నిల్వలు తదితర అంశాలను గురించి తెల్సుకొని మంత్రి కొప్పుల ఈశ్వర్ దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారం కోసం సమిష్టి కృషి చేయాలనీ అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here