కరోనా గిరోనా జాంత నై చేపల కోసం సామాజిక దూరం పాటించని జనాలు

0
242

రాయికల్ తాజా కబురు: మండలంలోని రామాజీ పేట గ్రామంలోని చెరువు వద్ద మంగళవారం చేపలు విక్రయిస్తుండగా గ్రామంలోని ప్రజలే కాకుండా ఆయా గ్రామాల నుంచి చేపలు కొనుక్కోవడానికి పెద్ద ఎత్తున జనం గుమిగూడారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో జనం మాత్రం కరోనా గిరోనా జాంతానై అంటూ చేపలు కొనుక్కోవడానికి ఒక్కసారిగా వందల సంఖ్యలో చెరువు వద్ద గుమి గుడారు. చెరువులో నుంచి చేపలు పట్టి మార్కెట్లో సామాజిక దూరం పాటిస్తూ విక్రయించాల్సి చేపలను చెరువు వద్ద అమ్మడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. ఈ విషయంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు చూసి చూడనట్లు గా వ్యవహరించడంతో కరోనా రక్కసి పై అజాగ్రత్తగా ఉండటం అంత మంచిది కాదని, ప్రజలను అప్రమత్తం చేయాల్సిన స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తున్నారని స్థానికులు తాజా కబురు ప్రతినిధితో వివరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here