కరోనా కు దూరంగా ఆ గ్రామం,చేతులెత్తి దండం పెడుతా మా ఊళ్లోకు రావద్దంటున్న రాగోజీపేట సర్పంచి…

0
110

కరోనా కు దూరంగా ఆ గ్రామం,చేతులెత్తి దండం పెడుతా మా ఊళ్లోకు రావద్దంటున్న రాగోజీపేట సర్పంచి…

సెకండ్ వే లో ఒక్క పాజిటివ్ కేసు నమోదు కాలేదు…

మా ఊళ్లో కు ఎవరు రావద్దు, ఊళ్లోవాళ్లు ఎక్కడికి వెళ్లద్దు…

ఏ సమస్య వచ్చిన సమకూర్చుతున్న సర్పంచి….

అదో మారుమూల పల్లె అభివృద్ధి కి ఆమడదూరంలో ఉండే పళ్లె,ఆ గ్రామానికి అప్పట్లో ఆడపిల్లలను ఇవ్వాలన్న భయపడెవారు, కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా రివర్స్ ఇప్పుడు ఎక్కడ చూసిన ఆ చిన్న పల్లె కథనె చెప్పుకుంటున్నారు,దేశవ్యాప్తంగా మొన్ననే ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కు ఈ గ్రామం‌ ఎంపికైంది, ఇక్కడి సర్పంచ్ చేస్తున్న విశేషా సేవలకు ఇప్పుడు గ్రామంలో సెకండ్ వే లో ఒక్క పాజిటివ్ కేసు నమోదు కాలేదు,చిన్న గ్రామమైన చింతలేని గ్రామంగా ముందుకు సాగుతుంది…

ఇది జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం రాగోజీపేట్ గ్రామం, ఇక్కడ 1200 జనాభ నివస్తుంటుంది,
ఆ గ్రామంలో కరోనా పాజిటివ్ కేసులు లేవు, మొదటి వే లో చాలా జాగ్రత్తలు తీసుకున్న కేవలం ఒక్క కేసు నమోదు అయింది, అనుకోకుండా వచ్చిపడిన సెకండ్ వే లో పాజిటివ్ మాటనే వినద్దు అనుకున్నారు గ్రామ పంచాయతీ పాలకవర్గం, అందుకనూగూనంగా సర్పంచి బాలసానీ లహారిక గ్రామంలో ఇరువై రోజుల పాటు స్వచ్చంద లాక్ డౌన్ విధించారు, దాంతోపాటు ప్రజలను ఇళ్లనుండి బయటకు వెళ్లకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు, నిత్యం గ్రామంలో హైపొక్లోరైడ్ రసాయన స్ప్రే చేయించటం, గ్రామంలోకి ఇతర గ్రామాలవారు రాకుండా చూసుకోవటం, అత్యవసర అయితె బయటకు వెళ్లాల్సి వస్తె ఆ గ్రామంలోని ప్రజలు గ్రామపంచాయతీ అనుమతి తీసుకోనేలా ఆదేశాలు జారీ చేశారు, గ్రామంలో మాస్క్ లేకుండా ఏ ఒక్కరు బయటకు వెళ్లిన వెయ్యి రూపాలు జరిమానా విధిస్తున్నారు, గ్రామంలోకి ఎవరైన వస్తే వాళ్లకు పొలిమేరల్లో వాళ్ల వివరాలు అడిగి తెలుసుకొని శానిటైషన్ చేసిన తర్వాత పంపిస్తున్నారు,గత నెలలోని గ్రామంలో లాక్ డౌన్ విధించారు, ఉదయం, సాయంత్రం వేలల్లో మాత్రమె వాటిని తెరిచె విధంగా చూస్తున్నారు, అలాగే గ్రామంలో పరిశుభ్రత పై ప్రత్యేక శ్రద్ద పెట్టారు, నిత్యం గ్రామంలో హైపొక్లోరైడ్ రసాయన స్ప్రే చేపించటం, గ్రామంలోని తాగునీటిని ఎప్పటికప్పుడు శుబ్రపరచటం చేస్తున్నారు. ముఖ్యంగా బయటి గ్రామాలనుండి వచ్చెవాళ్లపై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారు, మా గ్రామంలోకి రావద్దని చేతులెత్తి దండం పెడుతున్నారు, ప్రతి నాలుగు రోజులకోసారి గ్రామపంచాయతీ పాకల వర్గం సమావేశం ఏర్పాటు చేసుకొని విధివిధానాలను ప్రకటిస్తుంటారు,

గ్రామంలో ఎవరికైన ఆరోగ్య సమస్య వాటిల్లితె ప్రభుత్వ వైద్యుల సూచనలు తీసుకోవడం అలాగే ఇతర సమస్యలు వచ్చినప్పుడు పెద్ద ఆసుపత్రికి వాహానం ఏర్పాటు చేసి వారిని పంపించటం చేస్తున్నారు, ఇలా కట్టుదిట్టమైన భద్రత వల్లనే మా గ్రామంలో కరోనా పాజిటివ్ కేసులే లేవని ప్రతి గ్రామం వాళ్లు ఇలా కఠినమైన చర్యలు తీసుకుంటె సాధ్యమవుతుందని లహారిక మారుతిగౌడ్ అంటున్నారు…ఒక మహిళ అయినా గ్రామాన్ని కాపాడటంలో ఎలాంటి ఇబ్బందులు లేవని ప్రతి ఒక్కరు నా కుటుంబ సభ్యులుగానే చూసుకుంటానని చెపుతున్నారు….

ఒకపక్క కరోనా పట్టణాలను, పల్లెలను వణికిస్తుంటె ఈ గ్రామస్తుల సమిష్టి కృషి కారణంగా కరోనా రహిత గ్రామంగా ముందుకు వెళుతుంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here