కరోనా కష్టకాలంలో “మేమున్నామంటు”అన్నదానం చేస్తున్న ఐకేర్ స్వచ్చంద సంస్థ సభ్యులు..

0
54

తాజాకబురు రాయికల్:

ఐ కేర్ ఫౌండేషన్,బి.జె.వై.ఎం ఆధ్వర్యంలో ఉచిత పౌష్టికాహారం పంపిణీ…

అన్నీదానాలకు మించిన దానం అన్నదానం,ఆకలితో అలమటిస్తున్నవాళ్లకు బుక్కెడంత అన్నం పెడితె యాదిచేసుకుంటారు,ఇలాంటి కరోనా కష్టకాలంలో పనులు లేకా,నిలువ నీడలేకా నాన ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు ఒక్క పూట అన్నం దొరకటం కష్టం,అలాంటి నిరుపేదలను గుర్తించి అటు కరోనా బాధితులకు,ఇటు నిరుపేదలకు అన్నం అందిస్తున్నారు ఐకేర్ స్వచ్చంద సంస్థ, బీజెపి నాయకుడు ఐకేర్ స్వచ్చంద సంస్థ వ్యవస్థపకుడు నాగిరెడ్డి రఘుపతి రెడ్డి ఆద్వర్యంలో ఈ కార్యక్రమం గత వారం రోజుల నుండి కొనసాగుతుంది,నిరుపేదలను గుర్తించటం అన్నం లేక అలమటిస్తున్నవారి కోసం ఆహారం తయారు చెయ్యడం సమయం ప్రకారం వాళ్లకు అందించడం వీళ్లు నిత్యం చేస్తున్న సేవలు….ఈ రోజు

జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని ఐ కేర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు నాగిరెడ్డి రఘుపతి రెడ్డి, మండల భా.జ.పా యువ మోర్చా‌ అధ్యక్షులు రాజనాల మధుకుమార్ ఆధ్వర్యంలో కరోనా బాధిత కుటుంబాలకు బుధవారం పౌష్టికాహారం పంపిణీ చేశారు. గత వారం రోజులుగా కరోనా సోకి హోం ఐసోలేషన్ లో ఉండి వంట చేసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నవారు ఫోన్ ద్వారా సంప్రదించిన వారికి, కరోనా బాధిత కుటుంబాలతో పాటు వృద్దులకు, పేదలకు కూడా ఉచితంగా పౌష్టికాహారం, పండ్లు పంపిణీ చేస్తున్నారు. సమాజ సేవ కార్యక్రమాల్లో ముందుంటూ,యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. స్వంత ఖర్చులతో వారు చేస్తున్న ఈ సేవలను పలువురు అభినందిస్తూన్నారు.ఈ కార్యక్రమంలో బిజేవైఎం కోశాధికారి గంగుల మనోజ్, యువకులు గడ్డం రమేష్, గంగుల భూమేష్, కుంట భూమేష్ పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here