

తాజా కబురు రాయికల్: జగిత్యాలజిల్లా కు చెందిన పలువురు యువకులు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి నుండి ప్రజలందరూ త్వరగా విముక్తిని పొంది, కరోనా నియంత్ర టీకా అందరికి అందుబాటులోకి రావాలని కోరుతూ బార్ దుబాయ్ లో వినాయక నవరాత్రి ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నారు. శుక్రవారం సాయంత్రం గణపతి ఉత్సవ విగ్రహాన్ని ప్రతిష్టించి, భక్తి శ్రద్దలతో భజనలు చేస్తూ వినాయకుని ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన యువకులు పొడకంటి రాజు,నరేందర్, సురేష్ ,తిరుపతి, వంశీ,శ్రవణ్,రాకేష్,రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.