కరోనాపై సోషల్ మీడియా నే అధికంగా భయపెడుతుంది…

0
67

సోషల్ మీడియాలో వస్తున్న భయంకరమైన వార్తల వల్లే కరోనా పట్ల అధిక సమస్య…..

కరోనా కష్టకాలం సంవత్సరం దాటింది ఆరంభమై,ఈ సమయంలో మీడియా, పత్రిక రంగం ప్రజలను చైతన్యపరిచేందుకు కీలక పాత్ర పోషించాయనటంలో సందేహాం లేదు, గడిచిన నాలుగు నెలల్లో మాత్రం కరోనా సెకండ్ వే ప్రారంభమైననుండి సోషల్ మీడియా మాత్రం కీలక పాత్ర పోషిస్తుంది, దానికి కారణం తెలిసి కొందరు తెలియక కొందరు నిజంగా తెలిసి కొందరు,తమ యూట్యూబ్, వెబ్‌సైట్, ఫేసుబుక్, ట్విట్టర్, వాట్సప్ ద్వారా తమ చానల్, వెబ్‌సైట్ ల ఆదాయం పెంచుకునెందుకు విపరీతమైన కరోనా పట్ల వార్తలను పబ్లీస్ చేస్తున్నారు,కొందరు యూట్యూబ్ చానల్ వాళ్లు డాక్టర్ల ఇంటర్యూ తీసుకొని అందులో సంచలనం కలిగించె ఆంశాలను జోడించి,తంబ్లైన్ పెట్టి వాటిని షేర్ చేస్తున్నారు….

కరోనా లక్షణాలు….

మొదటగా ఆరంభమయ్యెది ఈ వార్తతోనే కరోనా లక్షణాలు ఎలా ఉంటాయో వీళ్లు వివరిస్తారు, అందులో కొత్తగా చెప్పేది ఏం లేకున్నా సెన్సేషన్ కోసం కొత్తగా ఏదో ఆడ్ చేస్తారు, దాన్ని చూసి ఇలా ఉంటుందా, కరోనా లక్షణాలు ఇవా, అంటు లేనిపోనివి ఆపాదించుకొని పరీక్షలకు వెళ్లినవాళ్లు కొందరు పరీక్ష చేయించుకుంటె పాజిటివ్ వస్తే ఎలా అని బతుకుజీవుడా అంటు భ‌యం భయంగా బతుకీడుస్తున్నవాళ్లు కొందరు,నెషనల్, ఇంటర్నేషనల్ చానల్ వాళ్లు వైద్యుల ఇంటర్యూలకన్న ఎలాంటి జెన్యూటీలేని యూట్యూబ్ చానళ్లను వాటి వీడియో లను వైరల్ చేస్తున్నారు…..దీనివల్ల ప్రజల్లో భయానక వాతావరణ ఏర్పడింది, వ్యాధిపట్ల ఖచ్చితత్వాన్ని తెలుసుకోలేకపోతున్నారు…

కరోనా పాజిటివా..అయితె మీరు ఇలా ఉండకపోతె మీ పని అయిపోయినట్టె….

కొన్ని యూట్యూబ్,వెబ్‌సైట్ లల్లో ఇలాంటి భయాన్ని పెంచె తంబ్లైన్ పెట్టి అది చూసెలాగా చేస్తున్నారు,పాజిటివ్ వచ్చిన వ్యక్తి ఆ వార్త చూశాడా ఎక్కడలేని అనుమానాలు సందేహాలు తల్లెత్తుతున్నాయి,తెలిసినవాళ్లను అడిగినవాళ్లు కొందరు ఉండగా తెలియనివాళ్లు వాళ్లు చెప్పె వాటినే నిజం అనుకొని నానా ఇబ్బందులు పడుతున్నారు…

రానున్న రోజుల్లో అంత కరోనా విలయతాండవం…

వ్యూవర్స్ ఆసక్తిగా చూస్తారని ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్నారు,అసలే భయంలో నలుగుతున్న ప్రజలు ఈ వార్తల వల్ల ఇంకా భయానికి లోనవుతున్నారు…….

వాయిస్ రికార్డు, మార్ఫింగ్ ఫోటో లతో హడల్…

కరోనా టీకా ఇప్పిచ్చుకున్నాకా తర్వాత పరీక్ష చేసుకుంటే పాజిటివ్ వస్తది అని ఓ ఆడియో వైరల్ అయింది, అలాగె రానున్న రోజుల్లో మూడునెలలు లాక్ డౌన్ ఉంటుంది, నిత్యవసర సరుకులు అన్నీ తెచ్చుకోండి అని జేడి లక్ష్మినారాయణ వాయిస్ తో వాట్సప్ లో చెక్కర్లు కొట్టింది, నిత్యం ఏదో వీడియో,ఆడియో వైరల్ అవుతుంది.

వాక్సిన్ పై ….

వాక్సిన్ తీసుకుంటే ఇలా ఉంటుంది అలా ఉంటుంది, కోవిషీల్డ్ ఇలా, కో వాక్సిన్ అలా అంటు ఉదరగొడుతున్నారు,అలాగే కేసుల సంఖ్య పెట్టి భయబ్రాంతులకు గురిచెయ్యడం,మరణించినవాళ్ల సంఖ్య పెట్టి ప్రళయం వస్తుందని భయానికి లోను చెయ్యడం చేస్తున్నారు కానీ కోలుకున్నవారి సంఖ్య చెప్పడం లేదు, అలాగే ఆసుపత్రిలో కుప్పలు కుప్పలుగా కరోనా పేషేంట్స్,ఆక్సిజన్ లేవని ఇలా ప్రతినిత్యం ఇలాంటి అనవసరమైన చర్చ పెడుతున్నారు కానీ ప్రజలకు మానసీక దైర్యం మాత్రం కల్పించడం లేదు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here