కరోనాను జయించి తిరిగి విధుల్లో చేరిన డీఎస్పీ వెంకటరమణ

0
113

తాజా కబురు జగిత్యాల క్రైం రిపోర్టర్ :కరోనా మహమ్మారిని జయించి పలువురు పోలీస్ అధికారులు తిరిగి విధుల్లో చేరుతూ కరోనా వారియర్లుగా అభినందనలు అందుకుంటున్నారు., ఇటీవల కోవిడ్ బారిన పడిన డీఎస్పీ వెంకటరమణ కరోనా మహమ్మారిని మనోధైర్యం, డాక్టర్ల సూచనలతో జయించి సోమవారం తిరిగి విధుల్లో చేరారు. విధుల్లో చేరిన ఆయనకు అదనపు ఎస్పీ దక్షిణా మూర్తి , AR డీఎస్పీ ప్రతాప్, పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు.ఈ సందర్బంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ కరోనా సోకిన వ్యక్తుల పట్ల ఎవరు చిన్న చూపు ప్రదర్శించవద్దని, వారికి ధైర్యం చెప్పి త్వరగా కోలుకునేలా సూచనలు ఇవ్వాలని కోరారు. కోవిడ్ సోకిన వ్యక్తులు మనోధైర్యం కోల్పోవద్దని బలవర్ధకమైన, రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాన్ని తీసుకోవడంతో పాటు వైద్యులు సూచించిన అన్ని రకాల మందులను వాడుతూ స్వీయ నియంత్రణ పాటించడం ద్వారా కరోనాను జయించవచ్చని తెలిపారు.అనంతరం డీఎస్పీ మాట్లాడుతు కరోనాను జయంచి తిరిగి విధుల్లో చేరడం ఎంతో సంతోషం కలిగిస్తుందని, రెట్టింపు ఉత్సాహంతో ప్రజలలో కోవిడ్ 19 పట్ల అవగాహన కల్పించే విధంగా తన వంతు కృషి చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో AR డీఎస్పీ ప్రతాప్, టౌన్ ఇన్స్పెక్టర్ జయేష్ రెడ్డి పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here