కరోనాతో గల్ఫ్ లో జగిత్యాల జిల్లా వాసి మృతి

0
1308

కరోనా మహమ్మారి జిల్లాకు చెందిన మరో గల్ఫ్ కార్మికున్ని బలితీసుకుంది,ఉపాధి కోసం‌ పొట్ట చేతపట్టుకొని వెళ్లి బతుకుతామనుకున్న వారిని కరోనా పొట్టనెట్టుకుంటుంది.

హైదరాబాద్ డెస్క్ తాజా కబురు: జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి గత కొంతకాలం నుండి దుబాయ్ లోని అల్గోజ్ లో ఓ కంపెనీ లో పని చేస్తున్నాడు, అయితె సంవత్సరం క్రితమె స్వగ్రామం వచ్చి వెళ్లాడు. కరోనా ఎఫ్ఫెక్ట్ ఎక్కువ అయినా కంపెనీ పనులు యదా విధిగా కొనసాగించడంతో ఎప్పటిలాగె పనికి వెల్లి తన గదికి వచ్చిన అతడు సొమ్మటిల్లి పడిపోయాడు. స్నేహితులు వెంటనే అక్కడి ఆసుపత్రి కి తరలించారు. మొదటగా గుండెపోటుతో మృతి చెందినట్టు బావించిన వైద్యులు లక్షణాలు దృష్టి లో పెట్టుకొని కరోనా టెస్ట్ చేశారు అందులో పాజిటివ్ అని తేలింది. దాంతో మృతదేహాన్నీ అక్కడె కననం చేశారు. ఆ గల్ఫ్ కార్మికునికి బార్య,ఇద్దరు కొడుకులు ఉన్నారు. తండ్రి చనిపోయాడు శవం‌ అక్కడె కననం చేశారని తెలిసి కుటుంబం,గ్రామస్థులు శోకసంద్రంలో పడ్డారు. కాగా గత వారం రోజుల‌ క్రితం కోరుట్ల మండలం మోహాన్ రావుపేట్ కు చెందిన ఓ వ్యక్తి గల్ఫ్ లో కరోనా తో మృతి చెందాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here