కరోనాకు పళ్ళెకట్టడి….గ్రామాన్ని ఒక్కతాటిపైకి తెస్తున్న పైడిమడుగు గ్రామ సర్పంచ్,యంపీటీసి కుల సంఘాలు..

0
904

హైదరాబాద్, కోరుట్ల రూరల్:

కరోనాకు పళ్ళెకట్టడి

గ్రామాన్ని ఒక్కతాటిపైకి తెస్తున్న సర్పంచ్,యంపీటీసి,గ్రామసంఘాలు.

ఇరువై ఒక్కసంఘాలు రోజుకొకరు మూడు చెకు పోస్టుల్లో గస్తీ...

గ్రామంల్లోకి రావాలంటే ఫర్మిషన్ తీసుకోవాలి..

అనునిత్యం గ్రామాన్ని పరీశీలిస్తున్న సర్పంచ్,యంపీటీసి..

 

పైడిమడుగు సర్పంచ్- దమ్మ భీమారెడ్డి

పైడిమడుగు యంపీటిసి- గడికొప్పుల మాధురి గోపాల్

పల్లెలు బాగుంటే పట్టణాలు బాగుంటాయి అదేవిధంగా రాష్ట్రం దేశం కూడా బాగుంటుంది. అందుకే ఏ కవి కవిత్వం, కవిత్వాలు చెప్పిన అవి పల్లె నుండి మొదలవుతాయి ఇప్పుడు కూడా పల్లె జీవన విధానమే పది గ్రామాలకు స్ఫూర్తి ఇస్తున్నాయి..

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తున్న ప్రస్తుత తరుణంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో, ఆ పల్లె మాత్రం మిగతా పల్లెలకు వినూత్నంగా ముందుకు వెళుతుంది.. ఆ పల్లె ఎక్కడుందో…. ఆ పల్లె వాసులు చేసిన గొప్పతనమేంటో… ఇప్పుడు మనం తెలుసుకుందాం.

జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామంలో సుమారు ఆరువేల వరకు జనాభా నివసిస్తుంటారు. ఈ పల్లె మొదటినుండి ప్రత్యేకతను చాటుకుంటుంది. ఈ గ్రామంలో ఆసియా ఖండం లోని అతి పెద్దదైన ఐదు ఎకరాల మర్రి చెట్టు ఉంది. అలాగె గ్రామంలోకి ప్రవేశించగానే ప్రశాంతమైన వెంకటేశ్వర స్వామి ఆలయం గ్రామం నడిబొడ్డున శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం గ్రామ శివారులో ఎల్లమ్మ ఆలయం చుట్టూ ప్రకృతి, ఆ ప్రకృతి మధ్యలో వాగు వంక చెరువులు ఇవి ఈ గ్రామ ప్రత్యేకతలు. ఇవి మాత్రమే కాదు ఈ గ్రామ ప్రత్యేకతలు గ్రామంలో నిర్వహించే ప్రతి కార్యక్రమాన్ని ఎంతో గొప్పగా ఎంతో శ్రద్దగా, క్రమశిక్షణగా నిర్వహిస్తుంటారు..

కరోనాకు కళ్లేం…

రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్ ను ఈ గ్రామం సమర్థవంతంగా క్రమశిక్షణగా అమలు చేస్తుంది గ్రామంలో ఉన్న 21 కుల సంఘాలతో కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ రోజు కుల సంఘాలతో సమావేశం నిర్వహించి గ్రామంలో ఎలాంటి సమస్య వాటిల్లకుండా ఉండేందుకు ముందస్తుగా చర్యలు చేపట్టారు గ్రామంలో మూడు చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు…

రోజుకో కులసంఘం గస్తీ కస్తున్న గ్రామస్తులు

ఏర్పాటు చేసిన కుల సంఘాలను రోజుకొకరు చొప్పున మూడు చెక్ పోస్టుల్లో విధులు నిర్వర్తించే విధంగా హుకుం జారీ చేశారు. దాంతో ప్రతిరోజు మూడు చెక్పోస్టుల్లో ఒక కుల సంఘం సభ్యులు మూడు గ్రూపులుగా విడిపోయి ఉదయం 6 గంటలనుండి సాయంత్రం 8 గంటల వరకు తమ విధులను నిర్వర్తిస్తారు…

గ్రామంలోకి వచ్చేవారిని విచారణ చేస్తున్న గ్రామస్తులు

గ్రామంలో కి ఎవరైనా వాహనాల పైన లేక కాలినడకన వచ్చినట్లైతే వారిని ఆ రోజు విధులు నిర్వర్తించే కుల సంఘాల సభ్యులు విచారిస్తారు ఎక్కడనుండి వస్తున్నారు…? ఎందుకోసం వస్తున్నారని…? ఎవరిని కలవడానికి వెళ్తున్నారని…? విచారిస్తారు వారు చెప్పే మాటలు అనుమానం కలిగితే వెంటనే సర్పంచ్ కి ఎం.పి.టి.సి కి సమాచారం అందిస్తారు. అలా సమాచారం అందుకున్న ప్రజా ప్రతినిధులు ఆ ప్రయాణికులను విచారించి వారికి కరోనా పట్ల అవగాహన కల్పించి ఒకవేళ వారు చెప్పింది తప్పయితే గ్రామపంచాయతీ నుండి జరిమానా విధించడమే కాకుండా గ్రామం లోకి అనుమతించరు. ఇలా ప్రతిరోజు వచ్చి పోయే వారికి పేర్లు వారి అడ్రస్ పూర్తి వివరాలను రిజిస్టర్ లో పొందుపరుస్తారు.

పూర్వపు ఆచారాలను పాటిస్తూ…

ఒకవైపు మహమ్మారిని అంతమొందించేందుకు గ్రామం తరపున ఇలాంటి కార్యక్రమాలు చేపడుతూ గ్రామంలో  అనునిత్యం ప్రజలు చేయాల్సిన పని కూడా గ్రామపంచాయతీ నుండి తెలియజేస్తారు. అందులో అనాదిగా వస్తున్న ఆచారాలను పాటించే విధంగా ప్రతిరోజు ఇంటి ముందు పేడతో అలుకు చల్లుకోవాలి అని నిత్యం ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని అలాగే ప్రతిరోజు తమ ఆహారం రోగ నిరోధక శక్తి పెంపొందించే విధంగా నడుచుకోవాలని సూచిస్తారు గ్రామపంచాయతీ సిబ్బంది తమ రోజువారీ కార్యక్రమాలను మైకు ద్వారా తెలియజేస్తారు దానిని తూచా తప్పకుండా పాటించాలని అవగాహన కల్పిస్తారు…

యువత బేష్( పలువురికి కూరగాయలు పంపిణీ చేస్తున్న దొమ్మాటి రామకృష్ణ)

నిరుపేదలకు అర్థకసాయం అందజేస్తున్న (దొమ్మాటి‌ రవిగౌడ్)

ఈ గ్రామంలోని యువత అన్ని రంగాల్లో ముందంజలో ఉంటుంది. వలస కూలీలకు నిరుపేదలకు అన్నదాన కార్యక్రమాలు అలాగే కూరగాయల పంపిణీ ఆర్థిక సహాయాలు చేస్తూ,కరోనా కట్టడికి తమ వంతుగా చేయూతనిస్తున్నారు.పదిమందితో శభాష్ అనిపించుకుంటున్నారు.

జాతీయ ఆవార్డు…

నూతనంగా ఏర్పడ్డ పంచాయతీ సిబ్బంది చేసిన కార్యక్రమాలు ప్రజల అండదండలతో గ్రామంలో నిర్వహించిన కార్యక్రమాల వల్ల కేంద్ర ప్రభుత్వం ఈ గ్రామానికి కేంద్ర ఉత్తమ గ్రామపంచాయతీ అవార్డు ప్రకటించింది హరితహారం పల్లె ప్రగతి ఇంటింటికి మరుగుదొడ్లు విద్యా వైద్య రంగాల్లో అన్ని రకాలుగా ముందంజలో అందుకుగాను ఈ అవార్డు దక్కింది…

కరోనాపై పోరాటం-ప్రజల ఆరాటం

కరోనా వైరస్ ప్రబలుతుంది అని తెలిసిన మరుసటిరోజునుండి ఈ గ్రామంలో అన్నీ రకాల చర్యలు చేపట్టారు, గ్రామంలో రసాయన స్ప్రే, మురికి కాల్వలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచటం, అలాగె ప్రజలను బయటకు వెళ్లకుండా చర్యలు తీసుకోవటంలో గ్రామస్తులు, ప్రజా ప్రతినిధులు తమ వంతు‌ బాధ్యతను నిర్వర్తిస్తున్నారు.

సర్పంచ్,యంపీటీసి బాధ్యతగా బాధ్యతలు…

ఈ గ్రామ సర్పంచి దమ్మభీమారెడ్డి, యంపిటీసి గడికొప్పుల మాధురి గోపాల్, అలాగె వార్డు సభ్యులు, ఇతర నాయకులు, రైతుసంఘాల సభ్యులు,తమ గ్రామాన్ని సురక్షితంగా ఉంచేందుకు నిర్విరామంగా కృషి చేస్తున్నారు, కరోనా నియంత్రణ కోసం ప్రజలను బయటకు వెళ్లకుండా చేసెందుకు తమవంతు బాధ్యతను నెరవేర్చుతు ప్రజా సేవలో నిమగ్నమైనారు.

ప్రతి గ్రామం పైడిమడుగులా కావాలి..

గ్రామానికి ఎలాంటి విపత్తు ఎదురైనా తమ వంతుగా గ్రామం కోసం బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఇలాంటి గ్రామాలను, గ్రామ ప్రజలను, గ్రామ ప్రజా ప్రతినిధులు అలాగే ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులను చూసి మిగతా గ్రామ ప్రజలు స్ఫూర్తి పొందాలని కోరుకుందాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here