కరెంట్ వైర్ల కింద మొక్కలు నాటడం ఎందుకు…? పెరిగిన చెట్లను నరకడం ఎందుకు.. ?

0
35

జగిత్యాల తాజా కబురు: తెలంగాణకు హరితహారం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అటవీకరణ కార్యక్రమం కానీ మొక్కలు చెట్లుగా మారగానే నరికివేస్తున్నారు. సంవత్సరంలో ఒక చెట్టు 12 కిలోల కార్బన్‌ డైయాక్సైడ్‌ తీసుకుని ఆరుగురు సభ్యులున్న కుటుంబానికి అవసరమైన ఆక్సిజన్‌ అందిస్తుంది. 55 ఏళ్లుగల ఒక చెట్టు రూ.5.3లక్షల విలువైన ఆక్సిజన్‌ ఇస్తుంది. ప్రపంచ ఆరోగ్యసంస్థ లెక్కల ప్రకారం ఏడాదికి ఒక మనిషికి 740 కిలోల ఆక్సిజన్‌ అవసరం. అంత విడుదల కావాలంటే 7 చెట్లు ఉండాలి. ప్రతి వందమందికి 28 చెట్లు అవసరం.ఎక్కడైతే పచ్చదనం ఉంటుందో అక్కడ మేఘాలు త్వరితగతిన వర్షించి పుష్కలంగా వర్షాలు పడతాయి. తద్వారా భూగర్భ జలాలు కూడా పెరుగుతాయి. ఈ క్రమంలోనే పర్యావరణాన్ని కాపాడుకుందామంటూ తెలంగాణకు హరితహారం పేరిట మొక్కల పెంపకం చేపట్టినా వాటి సంరక్షణ బాధ్యతలు సరిగా చేపట్టకపోవడంతో ఆశించిన ప్రయోజనం కలగడం లేదు. మరోవైపు జిల్లాలో రహదారుల విస్తరణతోపాటు నాటే మొక్కలు 11కే.వి కరెంట్ వైర్ల కిందనే ఎక్కువగా నాటారు దీనితో మొక్కలు చెట్లుగా మారగానే వివిధ కారణాలతో చెట్లను నరికివేస్తున్నారు. ఫలితంగా పర్యావరణ సమతుల్యత దెబ్బతిని తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది.కరెంట్ వైర్ల కింద మొక్కలు నాటడం ఎందుకు…? పెరిగిన చెట్లను నరకడం ఎందుకు..? అని పర్యావరణ ప్రేమికులు ప్రశ్నిస్తున్నారు. మళ్లీ మొక్కలు నాటే కార్యక్రమానికి సమయం ఆసన్నమవడంతో వాటి ప్రాధాన్యతను గుర్తించడంతో పాటుగా రక్షించుకోవడంపై దృష్టి సారించాలని ఇక మీదట విద్యుత్ వైర్ల కింద మొక్కలు నాటకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here